Viral Video: వారెవ్వా.! ఇదేం స్పిన్ మాయాజాలం.. బంతి గింగిరాలకు బ్యాటర్ ఫ్యూజులౌట్.!

క్రికెట్‌లో ఎంతోమంది స్పిన్ మాస్టర్లు ఉన్నారు. తమ అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతారు. ఇక ఇప్పుడు నెట్టింట ఓ క్రికెట్‌కు సంబంధించిన ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. నమ్మశక్యం కాని రీతిలో బంతిని స్పిన్‌ చేసి బ్యాటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు ఓ బౌలర్.

Viral Video: వారెవ్వా.! ఇదేం స్పిన్ మాయాజాలం.. బంతి గింగిరాలకు బ్యాటర్ ఫ్యూజులౌట్.!
Ball Of The Century
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 13, 2024 | 1:18 PM

క్రికెట్‌లో ఎంతోమంది స్పిన్ మాస్టర్లు ఉన్నారు. తమ అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతారు. ఇక ఇప్పుడు నెట్టింట ఓ క్రికెట్‌కు సంబంధించిన ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. నమ్మశక్యం కాని రీతిలో బంతిని స్పిన్‌ చేసి బ్యాటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు ఓ బౌలర్. ఆ బౌలర్ మన టీమిండియా స్పిన్ మాంత్రికుడు హర్భజన్ శైలి బౌలింగ్‌ను అనుసరించగా.. తిప్పిన స్పిన్ మాత్రం షేన్ వార్న్‌ను గుర్తు చేసింది.

ఈ సంఘటన కేసీసీ టీ20 ఛాలెంజర్స్ కప్ 2024లో చోటు చేసుకుంది. కువైట్ నేషన్స్, ఎస్‌బీఎస్ సీసీ మధ్య జరిగిన మ్యాచ్ ఇది. ఆ బౌలర్ వేసిన బంతి ఆఫ్ స్టంప్ అవతల పడగా.. అది అనూహ్యంగా నమ్మశక్యం కానీ విధంగా స్పిన్ తిరిగి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. ఆ బౌలర్ స్పిన్ చూసి.. ప్రత్యర్ధి బ్యాటర్ మైండ్ బ్లాంక్ అయింది. బిత్తర చూపులు చూస్తూ గమ్మున పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూసిన నెటిజన్లు అందరూ కూడా షేన్‌ వార్న్‌ బాల్‌ ఆఫ్‌ ద సెంచరీని గుర్తు చేసుకుంటున్నారు.

కాగా, 1993లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో షేన్‌ వార్న్‌.. మైక్‌ గ్యాటింగ్‌ను అద్భుతమైన స్పిన్‌తో క్లీన్ బౌల్డ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ బంతిని ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా పిలుస్తారు క్రికెట్ ఫ్యాన్స్.