IPL 2024: టోర్నీ స్టార్ట్‌కాకుండానే.. కోహ్లీ టీంకు దెబ్బ మీద దెబ్బ.. అదేంటంటే.?

ఇంకా నెల రోజులు టైం ఉంది. ఇప్పుడిప్పుడే ఆ జట్టుకు చెందిన ప్లేయర్స్ ఒక్కొక్కరిగా తిరిగి ఫుల్ ఫామ్‌లోకి వస్తున్నారు. అయితేనేం.. ఆ టీంకు అనూహ్యంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జట్టుకు దూరమవుతున్నారు. ఇంతకీ ఆ జట్టు మరేదో కాదు..

IPL 2024: టోర్నీ స్టార్ట్‌కాకుండానే.. కోహ్లీ టీంకు దెబ్బ మీద దెబ్బ.. అదేంటంటే.?
Royal Challengers Bangalore
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 13, 2024 | 1:15 PM

ఇంకా నెల రోజులు టైం ఉంది. ఇప్పుడిప్పుడే ఆ జట్టుకు చెందిన ప్లేయర్స్ ఒక్కొక్కరిగా తిరిగి ఫుల్ ఫామ్‌లోకి వస్తున్నారు. అయితేనేం.. ఆ టీంకు అనూహ్యంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జట్టుకు దూరమవుతున్నారు. ఇంతకీ ఆ జట్టు మరేదో కాదు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ 2024కు ముందుగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా షాకులు తగులుతున్నాయ్. ఇప్పటికే ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ టామ్ కర్రన్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. ఇప్పుడు మరో ఇంగ్లీష్ ప్లేయర్ గాయం కూడా ఆర్సీబీకి ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్ రీస్ టోప్లీ గాయం మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్న టోప్లీ.. ఇప్పటికే దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌కు దూరం కాగా.. త్వరలోనే జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ ఆడే అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే క్యాష్ రిచ్ లీగ్ కూడా అతడు ఆడేది అనుమానంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2023 ద్వారా రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్‌లోకి ఎంటరయ్యాడు టాప్లీ. ఆ ఏడాది మినీ వేలంలో అతడిని రూ. 1.90 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే కేవలం ఒక్క మ్యాచ్ ఆడి.. ఆ తర్వాత గాయం కారణంగా మొత్తం లీగ్‌కు దూరమయ్యాడు. కాగా, టాప్లీ గతంలోనూ కీలక టోర్నీలకు గాయాల కారణంగా దూరమయ్యాడు. టీ20 వరల్డ్‌కప్‌-2022, వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఇంగ్లాండ్ జట్టులో భాగమైన టాప్లీ.. గాయాల కారణంగా ఆ మెగా టోర్నీల నుంచి తప్పుకున్నాడు.