టీమిండియా మిడిలార్డర్‌ వీక్..అక్కడే దెబ్బకొట్టాలి

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్ కప్  సమరంలో భారత్, పాక్ మధ్య ఆసక్తికర మ్యాచ్  ప్రారంభం అయింది. టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే భారత్ వీక్ పాయింట్‌పై పాక్ మాజీ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.  భారత్‌ మిడిలార్డర్ ఇంకా పటిష్టం కాలేదని.. మహ్మద్‌ ఆమిర్‌ దాన్ని దెబ్బతీయాలని  అక్రమ్‌ పేర్కొన్నాడు. దాయాది దేశాల మధ్య జరిగిన ఎన్నో మ్యాచ్‌లకు ‘కీ’ రోల్ పోషించిన అక్రమ్‌ పాకిస్థాన్‌ […]

టీమిండియా మిడిలార్డర్‌ వీక్..అక్కడే దెబ్బకొట్టాలి
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 16, 2019 | 3:20 PM

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్ కప్  సమరంలో భారత్, పాక్ మధ్య ఆసక్తికర మ్యాచ్  ప్రారంభం అయింది. టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే భారత్ వీక్ పాయింట్‌పై పాక్ మాజీ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.  భారత్‌ మిడిలార్డర్ ఇంకా పటిష్టం కాలేదని.. మహ్మద్‌ ఆమిర్‌ దాన్ని దెబ్బతీయాలని  అక్రమ్‌ పేర్కొన్నాడు.

దాయాది దేశాల మధ్య జరిగిన ఎన్నో మ్యాచ్‌లకు ‘కీ’ రోల్ పోషించిన అక్రమ్‌ పాకిస్థాన్‌ పేసర్లు భారత మిడిలార్డర్‌పై విజృంభిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ప్రపంచకప్‌ జట్టు ఎంపికలో ఆమిర్‌ను తొలుత ఎందుకు తీసుకోలేదో తనకు అర్థంకాలేదని, ఒకవేళ అతడు ఫామ్‌లో లేకపోయినా జట్టులో ఉండడం ఎంతో ముఖ్యమని చెప్పాడు. సీనియర్‌ ఆటగాడిగా యంగ్ ప్లేయర్స్‌కు సలహాలు ఇస్తాని అక్రమ్‌ చెప్పాడు. అలాగే బాబర్‌ అజాం కూడా నైపుణ్యం కలిగిన బ్యాట్స్‌మన్‌ అని, అతడిని కోహ్లీతో పోల్చడం సరికాదన్నాడు.