World Record: 52 ఫోర్లు, 24 సిక్సర్లతో 506 పరుగులు.. 12గురి బౌలర్ల ఊచకోత.. టీ20ల్లో వరల్డ్ రికార్డు.!

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్‌మెన్ విల్ జాక్వెస్ తుఫాను సృష్టించాడు. ఇంగ్లాండ్‌ వైటాలిటీ బ్లాస్ట్‌లో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదాడు..

World Record: 52 ఫోర్లు, 24 సిక్సర్లతో 506 పరుగులు.. 12గురి బౌలర్ల ఊచకోత.. టీ20ల్లో వరల్డ్ రికార్డు.!
Middlesex Vs Surrey
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 23, 2023 | 7:00 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విల్ జాక్వెస్ తుఫాను సృష్టించాడు. ఇంగ్లాండ్‌ వైటాలిటీ బ్లాస్ట్‌లో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదాడు. మిడిల్‌సెక్స్ బౌలర్లను భీకరంగా చిత్తు చేశాడు. తన ఇన్నింగ్స్ ద్వారా అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న సర్రే జట్టుకు భారీ స్కోర్ అందించినా.. చివరికి ఓటమిపాలైంది. జాక్వెస్ 45 బంతుల్లో 96 పరుగులు బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మిడిల్‌సెక్స్ బౌలర్ ల్యూక్ హాల్‌మన్ వేసిన 11వ ఓవర్‌లో జాక్వెస్ వరుసగా 5 సిక్సర్లు కొట్టాడు. తృటిలో వరల్డ్ రికార్డు మిస్ అయ్యాడు.

ఇదిలా ఉంటే.. వైటాలిటీ బ్లాస్ట్‌లో భాగంగా గురువారం సర్రే, మిడిల్‌సెక్స్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో సర్రే జట్టు మొదట బ్యాటింగ్‌ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. 177 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోని సర్రే, ఆ తర్వాత 8 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయింది. జాక్వెస్ 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ఇవాన్స్ 85 పరుగులు చేశాడు. ఇవాన్స్ తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు.

అనంతరం 253 పరుగుల భారీ లక్ష్యాన్ని మిడిల్‌సెక్స్‌ 4 బంతులు మిగిలి ఉండగానే.. 7 వికెట్ల తేడాతో చేధించింది. కెప్టెన్ స్టీఫెన్ 39 బంతుల్లో 73 పరుగులు, మాక్స్ హోల్డెన్ 35 బంతుల్లో 68 పరుగులు చేసి.. ఈ రికార్డు రన్ చేజ్‌లో కీలక పాత్ర పోషించారు. గత 15 టీ20 మ్యాచ్‌ల్లో మిడిల్‌సెక్స్‌కు ఇదే తొలి విజయం. మిడిల్‌సెక్స్ ఈ సీజన్‌లో సౌత్ గ్రూప్‌లో ఇంతకముందు ఆడిన 10 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. టీ20 బ్లాస్ట్ చరిత్రలోనే అతిపెద్ద లక్ష్యాన్ని సాధించి ఈ సీజన్‌లో తన ఖాతా తెరిచింది మిడిల్‌సెక్స్‌ జట్టు.