Video: కోహ్లీ తలకే గురిపెట్టి కొట్టిన సీఎస్‌కే బౌలర్! గాయపడిన సింహంలా బదులిచ్చాడు..!
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో, మతీష పతిరానా విరాట్ కోహ్లీ తలను టార్గెట్ చేసి బౌన్సర్లు వేయగా, కోహ్లీ ఆ తర్వాత రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ బాది, 31 పరుగులు చేశాడు. RCB బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ గెలుచుకుంది.

ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి.. టేబుల్ టాపర్‌గా నిలిచింది ఆర్సీబీ. తమ హోం గ్రౌండ్‌లో హాట్ ఫేవరేట్‌గా దిగిన సీఎస్‌కేను.. ఆర్సీబీ పూర్తిగా డామినేట్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ అదరగొట్టింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో సీఎస్‌కే బౌలర్ మతీష పతిరానా ఏకంగా విరాట్ కోహ్లీ తలకే గురిపెట్టి బౌన్సర్లు సంధించాడు.
ఆ ఓవర్‌లో ఫస్ట్ బాలే కోహ్లీ హెల్మెట్‌కు చాలా బలంగా తాకింది. దాంతో ఫిజియో వచ్చి కంకషన్ టెస్ట్ కూడా నిర్వహించారు. పతిరానా వేసిన ఆ డెడ్లీ బౌన్సర్ నేరుగా కోహ్లీ హెల్మెట్ ముందు భాగంలో చాలా బలంగా తాకింది. వేరే బ్యాటర్ అయితే.. ఆ దెబ్బకు కాసేపు ఫీల్డి వదిలేసి వెళ్లేవాడు. కానీ, అక్కడుంది కింగ్ కోహ్లీ. బాల్ అలా నేరుగా తాకినా, తర్వాత బంతి కూడా బౌన్సర్‌గా వచ్చినా.. గాయపడిని సింహంలా గర్జించాడు. యాజిటీజ్‌గా వచ్చిన నెక్ట్స్ బాల్‌ను అద్భుతంగా కనెక్ట్ చేసి.. ఏకంగా స్క్వౌర్ లెగ్ పైనుంచి సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీ తరలించాడు. ఇలా ఆ ఓవర్‌లో ఫస్ట్ బాల్ హెల్మెట్‌కు తాకడంతో కోహ్లీ ఇగో హర్ట్ అయినట్లు అనిపించింది.
ఆ తర్వాతి రెండు బంతుల్లో కోహ్లీ సిక్స్ ఫోర్ బాది.. తన సత్తా అంటే చూపించాడు. అప్పటి వరకు స్లోగా ఆడుతున్న కోహ్లీ ఒక్కసారిగా గేర్ మార్చినట్లు కనిపించాడు. కోహ్లీ తలను టార్గెట్‌గా చేసుకొని.. పతిరానా ఆ బౌన్సర్ వేయడం, తర్వాత రెండు బంతుల్లో పది పరుగుల సమర్పించుకోవడం చూసి.. పడుకున్నోడిని లేపి మరీ తన్నించుకోవడం అంటే ఇదే అనే సమెత గుర్తొచ్చింది అంటున్నారు క్రికెట్ అభిమానులు. మొత్తంగా 30 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో కోహ్లీ 31 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. స్టార్టింగ్‌లో కాస్త స్ట్రగుల్ అయిన కోహ్లీ.. పతిరానా చేసిన పనికి టచ్‌లోకి వచ్చాడు. అయితే అదే వేగంతో ఆడే క్రమంలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
PATHIRANA HIT KOHLI ON THE HELMET…!!
– Kohli smashed 6 & 4 in the next 2 balls 🤯
A COLD MOMENT BY KING KOHLI AT CHEPAUK🥶#CSKvsRCB #RCBvsCSK #CSKvRCB #rcbvscsk #cskvsrcb #MSDhoni #MSDhoni𓃵 #ViratKohli𓃵 #ViratKohli #IPL #IPL2025pic.twitter.com/z8yzChldAA
— Harsh (@Harshsuthar119) March 28, 2025
VIRAT KOHLI HITS 6,4 vs PATHIRANA AFTER HIT ON HELMET.
– The GOAT. 🐐pic.twitter.com/LXVFWaKoKO
— Tanuj (@ImTanujSingh) March 28, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.