Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: అదే మా కొంప ముంచింది.. తప్పు ఒప్పుకున్న CSK సారథి! ఒకటా రెండా, ఒక్కరికే మూడు ఛాన్సులు ఇస్తే ఎలా మరి?

CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ RCB చేతిలో ఓటమి అనంతరం ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలే ప్రధాన కారణమని అన్నారు. ముఖ్యమైన క్యాచ్‌లు వదిలేయడంతో మ్యాచ్ CSK చేతుల నుంచి జారిపోయిందని అంగీకరించారు. RCB మొదట బ్యాటింగ్ చేసి 196 పరుగులు చేయగా, CSK 146 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్‌లో అదనపు పరుగులు ఇవ్వడం, బ్యాటింగ్‌లో పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోలేకపోవడం కూడా ఓటమికి దారితీసిందని గైక్వాడ్ పేర్కొన్నారు.

IPL 2025: అదే మా కొంప ముంచింది.. తప్పు ఒప్పుకున్న CSK సారథి! ఒకటా రెండా, ఒక్కరికే మూడు ఛాన్సులు ఇస్తే ఎలా మరి?
Csk Captain Ruturaj
Follow us
Narsimha

|

Updated on: Mar 29, 2025 | 6:24 AM

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఓటమిఓటమి అనంతరం తీవ్రంగా స్పందించారు. ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలే తమ విజయావకాశాలను దెబ్బతీశాయని అతను ఓటమిని అంగీకరించాడు. ముఖ్యంగా, కీలకమైన క్యాచ్‌లు వదిలేయడం, బౌలింగ్‌లో అదనంగా 20 పరుగులివ్వడం CSK కు తీవ్రమైన దెబ్బ ఇచ్చిందని చెప్పాడు .ఇచ్చిందని చెప్పాడు.

IPL 2025లో భాగంగా చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) CSK ను 50 పరుగుల తేడాతో ఓడించింది . ఇది CSKకి కఠినమైన ఓటమిగా మారింది. ఫీల్డింగ్‌లో తప్పిదాలు జరిగితే, ఫలితం పూర్తిగా మారిపోతుందనే గైక్వాడ్ తన కామెంట్స్ ద్వారా స్పష్టం చేశాడు .​

“నిజాయితీగా చెప్పాలంటే, 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడమే ఈ పిచ్‌పై చాలా కష్టం, అలాంటిది 20+ పరుగులు అదనంగా ఇచ్చుకున్నాము” అని గైక్వాడ్ అన్నాడు. తన జట్టు ఫీల్డింగ్‌లో చాలా తప్పులు జరిగాయి అని ముఖ్యంగా, క్యాచ్‌లు వదిలేయడం మమ్మల్ని కష్టాల్లో పడేసింది అని పేర్కొన్నాడు.

RCB బ్యాటింగ్ చేస్తుండగా, CSK ఫీల్డర్లు కీలక క్యాచ్‌లు వదిలేశారు. ఇందులో RCB కెప్టెన్ రజత్ పటీదార్ క్యాచ్‌ను వదిలేయడంతో అతను అర్థ శతకం చేసి CSK పై ఒత్తిడి పెంచాడు . ఈ తప్పిదం మ్యాచ్‌కు కీలక మలుపు తిప్పింది .

గైక్వాడ్ మాట్లాడుతూ, “బ్యాటింగ్‌లో కూడా మేము పవర్ ప్లేను సరిగ్గా ఉపయోగించలేకపోయాము. బంతి పాతబడే వారికి బ్యాటింగ్ మరింత కష్టమవుతుంది. కాబట్టి, కొత్త బంతిని ఉపయోగించుకుని వేగంగా పరుగులు చేయాలి. కానీ ఈసారి కొత్త బంతి ఐదు ఓవర్ల వరకూ స్వింగ్ అయ్యింది. ఇది మాకు పెద్ద సమస్యగా మారింది” అని అన్నాడు.

RCB టాస్ మొదట బ్యాటింగ్ చేసి, 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది . ఫిల్ సాల్ట్ (32), విరాట్ కోహ్లీ (31), రజత్ పటీదార్ (51) మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో టీమ్ డేవిడ్ (22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు . CSK బౌలర్లు వికెట్లు తీయడంలో కొంత మేరకు విజయవంతమైన, క్యాచ్‌లు వదిలేయడం మిగిలిన పరిస్థితిని RCBకి అనుకూలంగా మార్చుకుంది .

అనంతరం, లక్ష్యాన్ని ఛేదించేలా CSK 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసింది . కీలకమైన దశల్లో వికెట్లు కోల్పోవడం, ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు CSK కు భారంగా మారాయి .

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..