Year Ender 2022: కోహ్లీ రూం వీడియో మొదలు దీప్తి రనౌట్ వరకు.. ఈ ఏడాది క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన వివాదాలివే
క్రికెట్‌ను జెంటిల్‌మెన్ గేమ్ అంటారు. అయితే చాలా సందర్భాలలో ఈ గేమ్‌లో కూడా గొడవలు జరిగాయి. వివాదాలు చెలరేగాయి. క్రికెటే కాదు ఏ క్రీడలోనైనా ఇప్పుడు వివాదాలు సర్వసాధారణమైపోయాయి. అలా ఈ ఏడాది కూడా కొన్ని సంఘటనలు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేశాయి.

క్రికెట్‌ను జెంటిల్‌మెన్ గేమ్ అంటారు. అయితే చాలా సందర్భాలలో ఈ గేమ్‌లో కూడా గొడవలు జరిగాయి. వివాదాలు చెలరేగాయి. క్రికెటే కాదు ఏ క్రీడలోనైనా ఇప్పుడు వివాదాలు సర్వసాధారణమైపోయాయి. అలా ఈ ఏడాది కూడా కొన్ని సంఘటనలు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేశాయి. భారత్ మొదలు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల ఆటగాళ్లు కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నారు.వీటి కొందరు స్టార్‌ఆటగాళ్లు శిక్షను కూడా అనుభవించాల్సి వచ్చింది. కాగా మరికొన్ని రోజుల్లో 2022 సంవత్సరం ముగియబోతోంది. నూతన సంవత్సరానికి సాదర స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో 2022లో క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసినఐదు పెద్ద వివాదాల గురించి తెలుసుకుందాం రండి.
దనుష్క గుణతిలకపై లైంగిక వేధింపుల కేసు
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌లో శ్రీలంక ప్లేయర్ దనుష్క గుణతిలక వివాదాల్లో చిక్కుకున్నాడు. ఓ అమ్మాయిపై అతను అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా పోలీసులు శ్రీలంక ఆటగాడిని అరెస్టు చేశారు. శ్రీలంక జట్టు ప్రపంచకప్ నుంచి నిరాశతో వెనుదిరిగినా గుణతిలక జట్టుతో కలిసి వెళ్లలేదు.11 రోజుల పాటు జైలులో కూడా గడిపాడు. కోర్టు బెయిల్ అందించినా శ్రీలంక క్రికెట్ బోర్డు అతనిపై నిషేధం విధించింది.




సందీప్ లమిచానేపై అత్యాచార ఆరోపణలు..
గుణతిలక మాదిరిగానే నేపాల్ క్రికెటర్, ఐపీఎల్ స్పిన్నర్ సందీప్ లమిచానేపై కూడా అత్యాచార ఆరోపణలు వచ్చాయి. 17 ఏళ్ల బాలికపై సందీప్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. నేపాల్‌లో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. కొన్ని రోజులు తప్పించుకుని తిరిగిన అతను నేపాల్ చేరుకున్న వెంటనే విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సందీప్‌పై వారెంట్ జారీ అయినప్పుడు, అతను కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు.
దీప్తి శర్మ రనౌట్..
భారత మహిళల జట్టు సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించింది. ఈ టూర్‌లోని మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో, భారత జట్టు స్పిన్నర్ దీప్తి శర్మ చేసిన పనికి క్రికెట్ ప్రపంచం మొత్తం రెండు ముక్కలైంది. ఈ మ్యాచ్‌లో దీప్తి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ షార్లెట్ డీన్‌ను మన్కడ్ రనౌట్ చేసింది. దీంతో పలువురు ఇంగ్లిష్ క్రికెటర్లు దీప్తిని విమర్శిస్తూ ట్విటర్‌లో పోస్టులు షేర్ చేవారు. దీప్తి క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీమిండియా క్రికెటర్లు, పలువురు మాజీ ఆటగాళ్లు ఇందులో తప్పేమీ లేదంటూ మహిళా క్రికెటర్‌కు అండగా నిలిచారు.
విరాట్ కోహ్లీ గది వీడియో..
ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ ఆడుతున్నప్పుడు, విరాట్ కోహ్లీ గదికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చాలా వివాదానికి దారితీసింది. ఆ సమయంలో పెర్త్‌లో ఉన్న టీమిండియా క్రౌన్ హోటల్‌లో బస చేసింది. కోహ్లీ తన గదిలో లేని సమయంలో అతడి గదిలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి అతడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో బయటకు రావడంతో కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై పలువురు క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పించారు. దీంతో హోటల్ యాజమాన్యం చర్యలు తీసుకుని వీడియో తీసిన వ్యక్తిని తొలగించింది.
View this post on Instagram
రమీజ్ రాజా ఔట్..
పాకిస్థాన్ క్రికెట్ ఎప్పుడూ వివాదాలతో ముడిపడి ఉంటుంది. ఏడాది పొడవునా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు తన ఆట, జట్టు ఎంపికపై విమర్శలు ఎదుర్కొంది. అయితే కొద్ది రోజుల క్రితం, పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాను పదవి నుండి తొలగించింది. చైర్మన్ బాధ్యతలను నజం సేథికి అప్పగించారు. దీని తర్వాత, సేథీ సెలక్షన్ కమిటీని కూడా తొలగించాడు. ఈ విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..