AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత పని చేసింది..! డిజాస్టర్ సినిమా కోసం రూ.700కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకుంది..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా అవకాశాలు అందుకోవడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. కొంతమంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం డేట్స్ అడ్జెస్ట్ అవ్వక భారీ ఆఫర్స్ ను మిస్ చేసుకుంటున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఆమె ఎవరంటే..

ఎంత పని చేసింది..! డిజాస్టర్ సినిమా కోసం రూ.700కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకుంది..
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 25, 2025 | 9:15 AM

Share

హీరోయిన్స్ స్టార్ డమ్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడున్న యంగ్ బ్యూటీ ఒకటి రెండు సినిమాలతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే ఒక్క సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా అరడజను సినిమాలను లైనప్ చేస్తున్నారు. యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటున్నారు. కుర్ర హీరోయిన్స్ జోరుకు కొంతమంది సీనియర్ హీరోయిన్స్ వెనకబడుతున్నారు. ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అవకాశాల రావడమే కష్టంగా మారిన సమయంలో ఓ హీరోయిన్ క్రేజీ ఆఫర్ ను మిస్ చేసుకుంది. ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా రూ. 700కోట్ల సినిమాను వదులుకుంది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది

డేట్స్ అడ్జెస్ట్ అవ్వక చాలా మంది హీరోయిన్ కొన్ని భారీ హిట్ సినిమాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా భారీ బడ్జెట్ సినిమాను మిస్ చేసుకుంది ఓ వయ్యారి. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్. ఈముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది ఆతర్వాత మహానటి సినిమాతో పాపులర్ య్యింది. ఈ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే

ఇక కీర్తి ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లోనూ సినిమా చేసింది కీర్తి. బేబీ జాన్ అనే సినిమాతో అక్కడ పరిచయం అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా కోసం కీర్తి ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుందని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఇటీవల ఛావా సినిమా విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దేహవ్యాప్తంగా ఛావా సినిమా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేసింది. అయితే ముందుగా హీరోయిన్ పాత్ర కోసం కీర్తిసురేష్ ను సంప్రదించారట. అయితే ఆ సమయంలో బేబీ జాన్ సినిమాతో బిజీగా ఉండటంతో ఆమె నో చెప్పిందని తెలుస్తుంది. ప్రస్తుతం కీర్తిసురేష్ సినిమాల స్పీడ్ తగ్గించింది.

ఇది కూడా చదవండి :మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్.. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్‌కు తీసిపోదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us