AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SportsPro 50mm Athletes: టాప్ 50లో విరాట్ కోహ్లీ మిస్.. మెస్సీ, ఫెదరర్‌లను అధిగమించిన హార్దిక్ పాండ్యా.. ఎన్నో స్థానంలో నిలిచాడంటే..?

Hardik Pandya: హార్దిక్ పాండ్యా అద్భుత బ్యాటింగ్ టెక్నిక్స్ కారణంగా భారత క్రికెట్ అభిమానులలో అత్యంత ప్రజాదరణ పొందాడు. దీంతో పాండ్యా 2021 లో అత్యంత మార్కెట్ కలిగిన క్రికెటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు.

SportsPro 50mm Athletes: టాప్ 50లో విరాట్ కోహ్లీ మిస్.. మెస్సీ, ఫెదరర్‌లను అధిగమించిన హార్దిక్ పాండ్యా.. ఎన్నో స్థానంలో నిలిచాడంటే..?
Hardik Pandya
Venkata Chari
|

Updated on: Aug 25, 2021 | 4:48 PM

Share

Hardik Pandya: టీమిండియాలోకి ఎంటరైనప్పటి నుంచి భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. చురుకైన బ్యాటింగ్ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన పాండ్య.. మంచి పేస్ బౌలింగ్‌తో పాటు, ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకుంటున్నాడు. టీమిండియాలో కీలకంగా మారాడనడంలో సందేహం లేదు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల జట్టులో తనదైన పాత్రను పోషిస్తున్నాడు. హార్దిక్ పాండ్య ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే అత్యంత ప్రజాదరణను కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో 2021 లో అత్యంత మార్కెట్ కలిగిన క్రీడాకారుల జాబితాలో చేరాడు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. క్రికెటర్ల లిస్టులో హార్దిక్ పాండ్యా అగ్రస్థానంలో నిలిచాడు. టాప్ 50లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడం గమనార్హం. ఈ లిస్టులో పాండ్యా, ధావన్ మినహా మరే ఇతర భారత క్రికెటర్ లేకపోవడం గమనార్హం.

Shikhar Dhawan

పాండ్యా ఈ జాబితాలో 11 వ స్థానంలో ఉన్నాడు. 169 పాయింట్లతో హార్దిక్ పాండ్యా 11వ స్థానంలో నిలిచాడు. మరో భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ 47 వ స్థానంలో నిలిచాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. లియోనల్ మెస్సీ (12 వ), రోజర్ ఫెదరర్ (13 వ) వంటి ఇతర అగ్రశ్రేణి క్రీడాకారులను కూడా అధిగమించడం విశేషం.

టాప్ టెన్‌లో ఆధునిక క్రీడా దిగ్గజాలు క్రిస్టియానో ​​రొనాల్డో 6వ స్థానం, నోవాక్ జొకోవిచ్ 9వ స్థానంలో ఉన్నారు. మొదటి రెండు స్థానాలను అమెరికన్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, జపనీస్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా నిలిచారు.

స్పోర్ట్స్ ప్రో 50 లిస్టులో అత్యంత మార్కెట్ కలిగిన అథ్లెట్లు (టాప్ 10): సిమోన్ బైల్స్ (యూఎస్ఏ) – జిమ్నాస్టిక్స్ నవోమి ఒసాకా (జపాన్) – టెన్నిస్ ఆష్లిన్ హారిస్ (యూఎస్ఏ) – ఫుట్‌బాల్ కానెలో అల్వారెజ్ (మెక్సికో) – బాక్సింగ్ పౌలో డైబాలా (అర్జెంటీనా) – ఫుట్‌బాల్ క్రిస్టియానో ​​రొనాల్డో (పోర్చుగల్) – ఫుట్‌బాల్ అలీ క్రీగర్ (యూఎస్ఏ) – ఫుట్‌బాల్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్) – టెన్నిస్ నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) – టెన్నిస్ అలెక్స్ మోర్గాన్ (యూఎస్ఏ) – ఫుట్‌బాల్

పూర్తి లిస్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. స్పోర్ట్స్ ప్రో 50 లిస్టు

Also Read: IND vs ENG: విజృంభిస్తున్న ఆండర్సన్.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లీ అవుట్..

Team India Cricketers: రూపు మార్చిన టీమిండియా క్రికెటర్లు.. నవ్వుకుంటున్న నెటిజన్లు.. ప్లేయర్లకు షాకిచ్చిన ఇన్‌స్టా అభిమాని!

MS Dhoni Helicopter Shot: ఇంగ్లీష్ టీ20లో ఎంఎస్ ధోని హెలికాప్టర్ షాట్..! ఆశ్చర్యపోతున్నారా.. ఎవరు కొట్టారో తెలుసా?

IND vs ENG 3rd Test Preview: జోరుమీదున్న టీమిండియా.. గెలిచేందుకు ఇంగ్లండ్ ఆరాటం.. నేటినుంచి హెడింగ్లీలో మూడో టెస్టు