Team India Cricketers: రూపు మార్చిన టీమిండియా క్రికెటర్లు.. నవ్వుకుంటున్న నెటిజన్లు.. ప్లేయర్లకు షాకిచ్చిన ఇన్‌స్టా అభిమాని!
Team India Cricketers: మూడో టెస్టుకు ముందు టీమిండియా ఆటగాళ్ల ఫొటోలో నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Team India Cricketers: మూడో టెస్టుకు ముందు టీమిండియా ఆటగాళ్ల ఫొటోలో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. టీమిండియా స్టార్ ఆటగాళ్ల ఫొటోలు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీరిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ ఫొటోలను చూసిన అభిమానులు నవ్వును ఆపుకోలేకపోతున్నారనడంలో సందేహం లేదు. అసలు ఆ ఫొటోల్లో ఏముందని అనుకుంటున్నారా? లావుగా ఉంటే భారత క్రికెట్ స్టార్ ఆటగాళ్లు ఎలా ఉంటారనే ఆలోచనతో ఓ అభిమాని చేసిన ప్రయత్నం నవ్వులు తెప్పిస్తోంది. టీమిండియాలోని స్టార్ క్రికెటర్లను ఫాట్‌గా తయారు చేయడంలో ఎంతో కష్టపడ్డాడు. చాలా ఫిట్‌గా ఉండే భారత ఆటగాళ్లు.. ఫాట్ ఇండియాగా తయారు చేశాడు. ఈ ఫొటోలో క్రికెటర్లు ఎంతో లావుగా, బానెడు పొట్టతో కనిపించారు. వీరి ఫొటోలను చూసిన అభిమానులు నవ్వును ఆపుకోలేకపోతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ ఫొటోల్లో క్రికెటర్ల ముఖ కవళికలు మాత్రం మారకుండా అలానే ఉన్నాయి. అచ్చం అంకుల్స్‌ను తలపించేలా తయారయ్యారు. దీంతో ఈ ఫొటోలపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఫిట్‌గా ఉండే మన టీమిండియా క్రికెటర్లు ఇలా అయ్యారేంటి అంటూ కొంతమంది కామెంట్ చేస్తే.. భ్యవిషత్తులో మన క్రికెటర్లు ఇలానే తయారవుతారా ఏంటి అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో ఆడుతుంది. ఇప్పటికే రెండు టెస్టులు అయిపోయాయి. ఇందులో తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక రెండోవ టెస్టులో టీమిండియా విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక నేడు లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌కు ఇరు టీంలు సిద్ధమయ్యాయి. ఫిట్‌నెస్ విషయంలో టీమిండియాలో కోహ్లీ చాలా మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫిట్ ఫ్రీక్‌గా మారి టీమ్‌ను సైతం ఫిట్ ఇండియాగా మార్చాడు. ఆటగాళ్లు జట్టులోకి రావాలంటే పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాలని, జట్టు ప్రమాణాలు అందుకోవాలనే కోహ్లీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
19 ఏళ్ల వయసులోనే 20 సిక్సర్లు.. 30 ఫోర్లు బాదాడు..! అతడి ధాటికి బౌలర్లు విలవిలలాడిపోయారు..