Kohli vs Root: లార్డ్స్ లాంగ్‌రూమ్‌లో కోహ్లీ, రూట్ వాగ్వాదం.. తోడైన టీం ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే..?
దూకుడుకి మారుపేరుగా నిలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ల మధ్య తీవ్రమైన గొడవ జరిగినట్లు సమాచారం. రెండో టెస్టులో విజయం సాధించిన అనంతరం ఈ వాగ్వాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.
Kohli vs Root: టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల్ సిరీస్‌లో భాగంగా ఇప్పిటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి. ఇందులో తొలి టెస్టు వర్షం కారంణంగా డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. అలాగే లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక నేటి నుంచి మూడో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా ఓ సంచలన విషయం బయటకు తెలిసింది. దూకుడుకి మారుపేరుగా నిలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ల మధ్య తీవ్రమైన గొడవ జరిగినట్లు సమాచారం. రెండో టెస్టులో విజయం సాధించిన అనంతరం ఈ వాగ్వాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇరు జట్ల ప్లేయర్లు గుంపులుగా చేరి తిట్టుకున్నారని సమచారం.
అసలు గొడవ లార్డ్స్ టెస్టు మూడో రోజు నుంచి షురువైందని సమచారం. తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ 180 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆఖరి బ్యాట్స్‌మన్‌గా వచ్చిన జేమ్స్ అండర్సన్‌కు టీమిండియా బౌలర్ బుమ్రా షార్ట్‌పిచ్ బాల్స్ సంధించాడు. వీటిల్లో కొన్ని అండర్సన్ శరీరానికి తగిలాయి. ఇంగ్లండ్ టీం ఆలౌట్ కాగానే జేమ్స్ అండర్సన్.. జస్ప్రీత్ బుమ్రాపై బూతులతో చెలరేగాడు. దీంతో ఇరు టీంల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇరు జట్ల ఆటగాళ్లు గుంపులుగా లార్డ్స్ లాంగ్‌రూమ్‌లో తిట్టుకున్నారని డైలీ టెలిగ్రాఫ్‌లో ఓ కథనం ప్రచురించారు. ఈ సమయంలో ఇరు టీంల సారథులు విరాట్‌కోహ్లీ, జో రూట్ కూడా ఒకరిపై ఒకరు మాటల దాడికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు.
కాగా, లార్డ్స్ లాంగ్‌రూమ్‌ను ఎంతో పవిత్రంగా భావిస్తారు. మ్యాచును తిలకించేందుకు ఇక్కడికి మాజీ క్రికెటర్లు కూడా వస్తుంటారు. కరోనా నిబంధనలతో మాజీలను లాంగ్ రూమ్‌లోకి నిషేధించారు. ఇలాంటి లాంగ్‌రూమ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు తిట్టుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమయింది. డిన్నర్ చేసేటప్పుడూ ఇలాంటి వాతావరణం కనిపించిందని తెలిసింది. ఇక ఆఖరి రోజు బుమ్రా, షమి అద్భుత భాగస్వామ్యంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. అనంతరం ఇంగ్లండ్ టీంను కేవలం 60 ఓవర్లలోపే ఆలౌట్ చేశారు. దీంతో 151 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
IND vs ENG: నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్.. చెలరేగిపోతున్న ఇంగ్లాండ్ బౌలర్లు..