Virat Kohli: ఇదెక్కడి వింత రీజన్ సామీ.. ఆయనతో వివాదమే కోహ్లీ కొంప ముంచిందా..?
Virat Kohli: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ గణాంకాలు చాలా మంది దిగ్గజ ఆటగాళ్ల కంటే మెరుగ్గా ఉన్నాయి. కెప్టెన్‌గా, టెస్ట్ ఫార్మాట్‌లో మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ ఎక్కువ విజయాలు నమోదు చేశాడు. అతను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తోపాటు అనేక ఇతర దేశాలపై పరుగుల వర్షం కురిపించాడు.

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫామ్, ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ రిటైర్మెంట్ చేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విరాట్ మరికొంత కాలం టెస్ట్ క్రికెట్ ఆడాల్సిదంటూ నిపుణులు చెబుతున్నారు. కానీ, కోహ్లీ పదవీ విరమణతో అందరికీ షాకిచ్చాడు. ఈ క్రమంలో కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో తాజాగా సౌరవ్ గంగూలీతో గొడవలు కూడా చేరాయి. గంగూలీతో వివాదం తర్వాత విరాట్ కోహ్లీకి చెడ్డ రోజులు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. మరి ఇందులో అసలు నిజం ఎంత ఉందనేది కోహ్లీకే తెలియాలి.
విరాట్ కోహ్లీకి అద్భుతమైన టెస్ట్ రికార్డ్..
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ గణాంకాలు చాలా మంది దిగ్గజ ఆటగాళ్ల కంటే మెరుగ్గా ఉన్నాయి. కెప్టెన్‌గా, టెస్ట్ ఫార్మాట్‌లో మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ ఎక్కువ విజయాలు నమోదు చేశాడు. అతను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తోపాటు అనేక ఇతర దేశాలపై పరుగుల వర్షం కురిపించాడు. అలాగే, 2016 నుంచి 2019 వరకు, టెస్ట్ మ్యాచ్‌లలో అతని బ్యాట్ నుంచి 7 డబుల్ సెంచరీలు వచ్చాయి.
ఇది మాత్రమే కాదు, కెప్టెన్‌గా అతను స్వదేశంలో ఒక్క టెస్ట్ సిరీస్‌లోనూ ఓడిపోలేదు. అదే సమయంలో విదేశీ గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించాడు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలకు వారి సొంత గడ్డపై కఠినమైన సవాల్ ఇచ్చాడు. కోహ్లీ 68 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. 40 గెలిచి 17 మాత్రమే ఓడిపోయాడు. 11 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
సౌరవ్ గంగూలీతో గొడవ తర్వాత విరాట్ కోహ్లీకి బ్యాడ్ డేస్..
2021 సంవత్సరం నుంచి విరాట్ కోహ్లీ అదృష్టం మారుతున్నట్లు కనిపిస్తోంది. సౌరవ్ గంగూలీ 2019 అక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడయ్యాడని తెలిసిందే. ఆ తర్వాత 2021 సంవత్సరంలో టీ20 ప్రపంచ కప్ తర్వాత, పనిభారాన్ని చూపుతూ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. కానీ అతను వన్డే, టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగాడు.
ఇది సౌరవ్ గంగూలీకి నచ్చలేదని, కొన్ని వారాల తర్వాత బోర్డు రోహిత్ శర్మను టీ20ఐ కెప్టెన్‌గా నియమించిందని చెబుతున్నారు. కాగా, కెప్టెన్సీని వీడవద్దని విరాట్ కోహ్లీని ఒప్పించానని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కానీ, ఇది విరాట్ కోహ్లీ అంగీకరించలేదు. బోర్డు ఇద్దరు వైట్-బాల్ కెప్టెన్లను కలిగి ఉండటానికి ఇష్టపడలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి.
మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో మాట్లాడుకోని విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ..
అదే సమయంలో, డిసెంబర్ 2021లో, విరాట్ కోహ్లీ సౌరవ్ గంగూలీ వాదనలను తిరస్కరించాడు. టెస్ట్ జట్టు ఎంపికకు కేవలం 90 నిమిషాల ముందు వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తనను తొలగించినట్లు తనకు సమాచారం అందిందని విరాట్ చెప్పుకొచ్చాడు. మీడియాలో ఈ విషయాలను బహిరంగంగా మాట్లాడినందుకు గంగూలీ, బోర్డు అతనిపై అసంతృప్తి చెందారని నివేదిక పేర్కొంది. దీని కారణంగా ఇద్దరి మధ్య వివాదానికి కారణమైంది.
ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్ట్ సిరీస్‌ను టీం ఇండియా కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లీ టెస్ట్ జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. 5 నెలల్లోనే, అతను మూడు ఫార్మాట్లకూ కెప్టెన్సీని కోల్పోయాడు. ఆ తర్వాత, అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత, ఐపీఎల్ 2023లో కూడా కోహ్లీ, గంగూలీ మధ్య అసంతృప్తి నెలకొందని వార్తలు వచ్చాయి. మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో గంగూలీని విస్మరించాడంటూ వార్తలు వినిపించాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




