Team India: రోహిత్, కోహ్లీ వారసులు వచ్చేశారు.. ఇకపై ఫ్యూచర్ మాదేనంటోన్న ఏడుగురు..
Virat Kohli - Rohit Sharma: గత కొన్ని సిరీస్‌ల నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాట్‌లు పూర్తిగా సైలెంట్‌గా మారాయి. దీంతో ఈ ఇద్దరు దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ల టెస్ట్ కెరీర్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. తదుపరి కొన్ని ఇన్నింగ్స్‌లలో భారీ స్కోర్లు రాకపోతే.. అదే వారి చివరి సిరీస్ కావొచ్చు.
Virat Kohli – Rohit Sharma: ముగింపు దగ్గర్లోనే కనిపిస్తోంది. ఇదే చివరి అవకాశం కావొచ్చు. బహుశా ఇకపై 4-5 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడేది. గత దశాబ్దంలో భారత క్రికెట్‌లోని ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్‌ల నిష్క్రమణకు మార్గం సుగమమైంది. గతంలో కంటే ఇప్పుడు రిటైర్మెంట్ మరింత చేరువైంది. ఒకరు భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ కాగా, మరొకరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. వీరిద్దరి బ్యాట్‌లు కొంతకాలంగా టెస్ట్ క్రికెట్‌లో సైలెంట్‌గా మారాయి. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ఈ నిశ్శబ్దం కొనసాగుతోంది. ఇదివరకే ‘డూ ఆర్ డై’ అని భావించిన సీరీస్ ఇది. కాబట్టి వీళ్లిద్దరికీ సమయం ముగిసిపోయిందని ఇప్పటి వరకు కనిపించిన పరిస్థితి సూచిస్తోంది.
అయితే, వీరిద్దరిని భర్తీ చేయడానికి సెలెక్టర్లు పరిగణించే ప్రత్యామ్నాయాలు ఎవరు? బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత, టీమ్ ఇండియా నేరుగా జూన్ 2025లో తదుపరి టెస్ట్ ఆడుతుంది. అది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లేదా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కావొచ్చు. ఒకవేళ ఈ టూర్ తర్వాత విరాట్, రోహిత్ లను డ్రాప్ చేయాలని సెలక్టర్లు నిర్ణయించుకుంటే.. ఇంగ్లండ్ టూర్‌లో ఎవరికి అవకాశం ఇవ్వవచ్చు? దీని కోసం ఖచ్చితంగా కొన్ని ఎంపికలు ఉన్నాయి.
సర్ఫరాజ్-అయ్యర్, జురెల్ బెస్ట్ ఆఫ్షన్..
టీమిండియాలో ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు ఆడిన కొన్ని ముఖాలు ఉన్నాయి. శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ పేర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అయ్యర్ ప్రస్తుతం టీమిండియాకు దూరమైనప్పటికీ, అతను తిరిగి వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. వీరితో పాటు, సర్ఫరాజ్‌కు ఈ సిరీస్‌లో అవకాశం లభించకపోవచ్చు. కానీ, అతని కెరీర్‌ను ప్రారంభించిన తీరును పరిగణనలోకి తీసుకుంటే, అతను భవిష్యత్తులో కూడా టీమ్ ఇండియాలో రెగ్యులర్ పార్ట్ అవడం ఖాయం. వీరిద్దరితో పాటు పెర్త్ టెస్టులో విఫలమైన ధ్రువ్ జురెల్ కూడా ఉన్నాడు. కానీ, సర్ఫరాజ్ లాగా అతను కూడా తక్కువ సమయంలో తన సత్తాను చాటాడు.
ఇద్దరు యువ బ్యాట్స్‌మెన్‌లు కూడా పోటీలో..
ఈ ముగ్గురే కాకుండా, కొంతమంది ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎక్కువ కాలం జట్టులో భాగంగా ఉండగలరు. ఇందులో యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ పేరు అగ్రస్థానంలో ఉంది. ఈ తమిళనాడు బ్యాట్స్‌మెన్ ఇటీవల ఆస్ట్రేలియా ఏపై భారత్ ఏ తరపున అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతోపాటు రంజీ ట్రోఫీ సీజన్‌లోనూ తన ప్రతిభ కనబరిచాడు. అతను ఈ సంవత్సరం ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే తరపున కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. ఈ 23 ఏళ్ల బ్యాట్స్‌మెన్ 28 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 41 సగటుతో 1948 పరుగులు చేశాడు.
సుదర్శన్ లాగానే తిలక్ వర్మ మరో యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. హైదరాబాద్‌కు ఆడే ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. 18 మ్యాచ్‌లలో 50 సగటుతో 1204 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో తన తుఫాన్ బ్యాటింగ్‌తో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న తిలక్ ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌లో కూడా పోటీదారుగా కనిపిస్తున్నాడు. అయితే, అతను శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ వంటి బ్యాట్స్‌మెన్ నుంచి సవాలును ఎదుర్కొంటున్నాడు.
పాటిదార్-గైక్వాడ్‌కు చోటు దక్కుతుందా?
వీరు కాకుండా, ఇద్దరు సీనియర్ ఫస్ట్ క్లాస్ బ్యాట్స్‌మెన్స్ కూడా ఉన్నారు. రెడ్ బాల్ క్రికెట్‌లో వారి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే వారికి అవకాశం లభించవచ్చు. వారిలో ఒకరు మహారాష్ట్ర బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్. అతను 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 41.52 సగటుతో 2533 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా టూర్ తనకి ఫర్వాలేదనిపించినా.. అతని సత్తా ఎవరికీ కనిపించలేదు.
మరో బ్యాట్స్‌మెన్ మధ్యప్రదేశ్‌కు చెందిన రజత్ పాటిదార్. అతను ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్‌లో తుఫాన్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే, టెస్ట్ ఫార్మాట్‌లో కూడా అంతే మంచి బ్యాట్స్‌మన్. అతను 66 మ్యాచ్‌ల్లో 43 సగటుతో 4636 పరుగులు చేశాడు. పాటిదార్ ఈ ఏడాది ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసి 3 మ్యాచ్‌లు ఆడినప్పటికీ, అందులో అతను 63 పరుగులు మాత్రమే చేశాడు. గైక్వాడ్ లాగా, అతని సామర్థ్యం కూడా ఎవరికీ కనిపించలేదు. అతనికి రెండవ అవకాశం వస్తే, అతను సద్వినియోగం చేసుకోవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..