AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కొడుకుతో కలిసి లండన్ వీధుల్లో కోహ్లీ షాపింగ్.. ఏం కొంటున్నాడో తెలుసా?

Virat Kohli: ఓ వైపు టీమ్ ఇండియా కొత్త టీ20 కెప్టెన్ విషయంలో దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. శ్రీలంకతో సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతున్న తరుణంలో.. వీటన్నింటికీ దూరంగా విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ సామాన్యుడిలా లండన్ వీధుల్లో తిరుగుతున్నాడు. అతనితో పాటు కొడుకు అకాయ్, భార్య అనుష్క కూడా ఉండటం విశేషం.

Video: కొడుకుతో కలిసి లండన్ వీధుల్లో కోహ్లీ షాపింగ్.. ఏం కొంటున్నాడో తెలుసా?
Virat Kohli Akay Video
Venkata Chari
|

Updated on: Jul 18, 2024 | 6:28 PM

Share

Virat Kohli Son Akaay Video: ఓ వైపు టీమ్ ఇండియా కొత్త టీ20 కెప్టెన్ విషయంలో దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. శ్రీలంకతో సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతున్న తరుణంలో.. వీటన్నింటికీ దూరంగా విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ సామాన్యుడిలా లండన్ వీధుల్లో తిరుగుతున్నాడు. అతనితో పాటు కొడుకు అకాయ్, భార్య అనుష్క కూడా ఉండటం విశేషం. విరాట్ పూల దుకాణం వద్ద నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ తన కొడుకు అకాయ్‌ని ఎత్తుకుని ఉన్నాడు. అతను పువ్వుల కోసం షాపింగ్ చేస్తున్నాడు. అనుష్క శర్మ కూడా పూలు కొనే పనిలో బిజీగా ఉంది.

లండన్ వీధుల్లో సామాన్యుడిలా..

విరాట్‌ కోహ్లి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సామాన్యుడిలా జీవించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తాను భారతదేశ వీధుల్లో ఎప్పుడూ ఇలా నడవలేనని, దాని కోసం తాను ఎంతో ఆశపడుతున్నానని గౌరవ్ కపూర్‌తో చెప్పుకొచ్చాడు. అయితే, ప్రస్తుతం ఈ విషయం భారతదేశంలో దాదాపు అసాధ్యం. అయితే విరాట్ కోహ్లీ లండన్‌లో ఇలా సామాన్యుడిలా జీవిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఎక్కువ సమయం లండన్‌లోనే గడుపుతున్నాడు. అతని కుమారుడు అకాయ్ లండన్‌లో జన్మించాడు. టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత విరాట్‌ కోహ్లి తొలుత ముంబైలో జట్టుతో కలిసి సంబరాలు చేసుకుని లండన్‌ వెళ్లాడు.

విరాట్ కోహ్లీ లండన్‌లో షాపింగ్ చేయడమే కాకుండా మతపరమైన ప్రదేశాలలో కూడా కనిపిస్తున్నాడు. ఇటీవల అనుష్కతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నాడు. గత 2-3 ఏళ్లలో విరాట్ కోహ్లీ చాలా మతపరమైన కార్యక్రమాలకు ఎక్కువగా హాజరవుతున్నాడు. అతని ఫోన్ వాల్‌పేపర్‌లో నీమ్ కరౌలీ బాబా పొటో కూడా కనిపిస్తుంది. విరాట్ అభిమానులు తమ సూపర్ స్టార్ కోసం ఎదురు చూస్తున్నారు. విరాట్ కోహ్లి శ్రీలంక టూర్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కాబట్టి విరాట్ కోహ్లీ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో చూడవచ్చు.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..