
మొదటి వికెట్‌కు 375 రన్స్ పార్ట్‌నర్ షిప్.. జట్టు మొత్తం కలిసి1107 పరుగులు.. వినడానికే వింతగా ఉంది కదా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అయినా, టెస్ట్ ఫార్మాట్‌లోనూ ఈ రికార్డు స్కోరు సాధ్యం కాదని చాలామంది భావించవచ్చు. అయితే సరిగ్గా 96 ఏళ్ల క్రితం ఒక జట్టు 1107 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోవడం గమనార్హం. 1926 డిసెంబర్ 28న ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ జట్టు విక్టోరియా న్యూసౌత్‌వేల్స్ ఈ రికార్డు ఫీట్ చేసింది. ఈ మ్యాచ్లో విక్టోరియా మొదటి ఇన్నింగ్స్‌లో 1107 పరుగులకు ఆలౌటైంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే అంతకు ముందు కూడా అత్యధిక పరుగులు చేసిన రికార్డు విక్టోరియా జట్టు పేరిటే ఉంది. ఇక విక్టోరియా-న్యూ సౌత్ వేల్స్ మధ్య జరిగిన ఈ చారిత్రాత్మక మ్యాచ్ విషయానికొస్తే.. న్యూ సౌత్ వేల్స్ తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫిలిప్స్ అత్యధికంగా 52 పరుగులు చేశాడు. ఆ తర్వాత విక్టోరియా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. వచ్చినవారందరూ ధాటిగా ఆడుతూ వరల్డ్ క్రికెట్‌లోనే రికార్డు స్కోరుకు బాటలు వేశారు. మొదట ఓపెనర్లు బిల్ పోన్స్‌ఫోర్డ్, వుడ్‌ఫుల్ బౌలర్లను చితక్కొట్టారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 375 పరుగులు జోడించారు.
వుడ్‌ఫుల్ అవుట్ అయిన తర్వాత, పోన్స్‌ఫోర్డ్ హంటర్ హెండ్రీతో కలిసి రెండో వికెట్‌కు 219 పరుగులు జోడించాడు. మూడో రోజు మ్యాచ్‌లో విక్టోరియా 657 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే నాలుగో నంబర్ బ్యాటర్ చివరివరకు క్రీజులో నిలిచాడు. టెయిలెండర్లు ఆల్బర్ట్, జాన్ ఎల్లిస్‌తో కలిసి స్కోరును 1000 దాటించాడు. మొత్తానికి మూడో రోజు విక్టోరియా 1,107 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత న్యూ సౌత్ రెండో ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇన్నింగ్స్ 656 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది విక్టోరియా. టెస్ట్ క్రికెట్, ఫస్ట్ క్లాస్ క్రికెటైనా ఇప్పటివరకు ఇదే రికార్డు విజయం. ఎవరూ ఈ రికార్డు స్కోరును అధిగమించలేకపోయారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..