Vaibhav Suryavanshi : బీసీసీఐ నిర్లక్ష్యం.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెరీర్‌కు ముప్పు?
అద్భుతమైన ఫామ్‌లో ఉండి, భవిష్యత్తులో స్టార్‌గా ఎదుగుతాడని భావిస్తున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కెరీర్‌కు సంబంధించి ఒక అనూహ్య అడ్డంకి ఎదురైంది. రంజీ ట్రోఫీలో బిహార్ తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్న ఈ ప్లేయర్‌కు, ప్రస్తుతం జరుగుతున్న ఒక పరిణామం కారణంగా జట్టులో స్థానం దక్కడం కష్టంగా మారింది.

Vaibhav Suryavanshi : భారత క్రికెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కెరీర్‌కు బీసీసీఐ తీసుకుంటున్న ఒక నిర్ణయం వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. బీహార్ తరఫున రాబోయే రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆడేందుకు వైభవ్‌కు మంచి అవకాశం ఉన్నప్పటికీ, బీహార్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలెక్షన్ ప్యానెల్‌లో మూడు కీలక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వెంటనే భర్తీ చేయకపోవడంతో, రంజీ ట్రోఫీకి జట్టును ఎంపిక చేయడానికి సెలెక్టర్లే లేకుండా పోయారు. దీని కారణంగా వైభవ్ సూర్యవంశీ వంటి టాలెంటెడ్ కుర్రాడికి ఈ సీజన్‌లో ఆడే అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది.
బీసీసీఐ ఈ మూడు ఖాళీ స్లాట్‌లలో ఎంపిక కమిటీ సభ్యులను నియమించేంతవరకు, బీహార్ రంజీ ట్రోఫీ జట్టును ఎంపిక చేయడం అసాధ్యం. సెలెక్షన్ కమిటీ పూర్తిస్థాయిలో లేకపోతే, ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవడం కుదరదు. బీసీఏ అధికారులు ఈ ఖాళీలను భర్తీ చేయాలని బీసీసీఐని ఇప్పటికే అభ్యర్థించారు. బీసీఏ జనరల్ మేనేజర్ నీరజ్ సింగ్ మాట్లాడుతూ.. “సెప్టెంబర్ 29 న జనరల్ మీటింగ్ జరిగింది. ఈ విషయంపై చర్చించాం. కానీ మాకు సమయం చాలా తక్కువగా ఉంది. బీసీసీఐ తదుపరి 2-3 రోజుల్లో సెలెక్షన్ కమిటీలో ఖాళీలను భర్తీ చేయవచ్చు” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ఏడాది కాలంగా వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బీహార్ రంజీ ట్రోఫీ తదుపరి సీజన్ అక్టోబర్ 15 తర్వాత ప్రారంభం కానుంది. ఆలోగా బీసీఏ సెలెక్షన్ కమిటీ భర్తీ కాకపోతే, వైభవ్ సూర్యవంశీకి ఈసారి రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కకపోవచ్చు. ఇది అతని కెరీర్‌కు ఒక పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉంది.
కేవలం 14 ఏళ్ల చిన్న వయసులోనే వైభవ్ సూర్యవంశీ పలు సంచలనాత్మక రికార్డులను సృష్టించాడు. ఆస్ట్రేలియాపై జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 62 బంతుల్లోనే 104 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. 14 ఏళ్లకే ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి, ఈ ఫార్మాట్‌లో కూడా అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఇలాంటి టాలెంటెడ్ ఆటగాడు, కేవలం అధికారుల నిర్ణయాలు ఆలస్యం కావడం వల్ల కీలకమైన రంజీ ట్రోఫీలో పాల్గొనలేకపోతే, అది దేశ క్రికెట్‌కు కూడా నష్టమే. బీసీసీఐ త్వరగా స్పందించి, వైభవ్ కెరీర్‌కు ఆటంకం కలగకుండా చూడాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




