AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs SA : టెస్టుల్లో టీ20 తరహా బ్యాటింగ్… 25 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ అరుదైన రికార్డు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్, మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌తో కలిసి ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరూ కలిసి తొలి 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

PAK vs SA : టెస్టుల్లో టీ20 తరహా బ్యాటింగ్... 25 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ అరుదైన రికార్డు
Pak Vs Sa
Rakesh
|

Updated on: Oct 12, 2025 | 4:40 PM

Share

PAK vs SA : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌ను పాకిస్థాన్ జట్టు ఘనంగా ప్రారంభించింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో లాహోర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో, మొదటి రోజే పాకిస్థాన్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా కెప్టెన్ షాన్ మసూద్, ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ కలిసి ఏకంగా 25 ఏళ్ల నాటి అరుదైన రికార్డును సమం చేశారు. టెస్ట్ మ్యాచ్‌లోనూ దూకుడుగా ఆడొచ్చని నిరూపిస్తూ, T20 తరహాలో పరుగులు రాబట్టారు.

25 ఏళ్ల రికార్డు సమం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్, మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌తో కలిసి ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరూ కలిసి తొలి 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ ఇంత వేగంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇంతకుముందు 2000 సంవత్సరంలో ఇంగ్లండ్‌పై ఫైసలాబాద్‌లో జరిగిన టెస్టులో పాకిస్థాన్ తొలి 10 ఓవర్లలో ఒక వికెట్‌కు 51 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో సయీద్ అన్వర్, షాహిద్ అఫ్రిది పాక్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.

అద్భుత భాగస్వామ్యం.. కానీ సెంచరీలు మిస్

తొలి వికెట్ త్వరగా కోల్పోయినా, కెప్టెన్ షాన్ మసూద్, ఇమామ్ ఉల్ హక్ పాక్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 161 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కెప్టెన్ షాన్ మసూద్ 147 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 76 పరుగులు చేసి స్పిన్నర్ ప్రెనెలన్ సుబ్రాయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కెప్టెన్ ఔటైన కాసేపటికే ఇమామ్ ఉల్ హక్ కూడా పెవిలియన్ చేరాడు. అతను 157 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 93 పరుగులు చేసి, కేవలం ఏడు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. సెనురన్ ముత్తుసామి అతడిని ఔట్ చేశాడు. కీలకమైన ఇద్దరు బ్యాటర్లు స్వల్ప వ్యవధిలో ఔటవ్వడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే మహోత్సవం.. జ్యేష్ఠాభిషేకం..
తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే మహోత్సవం.. జ్యేష్ఠాభిషేకం..
కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావకు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావకు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
ఎలాన్ మస్క్ తర్వాత అతడే.. నెలకు రూ.645 కోట్ల జీతం
ఎలాన్ మస్క్ తర్వాత అతడే.. నెలకు రూ.645 కోట్ల జీతం
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
దుబాయ్‌లో క్షిపణి దాడి కలకలం.. కాసేపటికే..
దుబాయ్‌లో క్షిపణి దాడి కలకలం.. కాసేపటికే..
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!