AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : ఏంది సామీ ఈ బ్యాటింగ్? ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్

Vaibhav Suryavanshi : ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఆడిన తొలి 75 బంతుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు హెన్రిచ్ క్లాసెన్ (2024లో 17 సిక్సర్లు) పేరిట ఉండగా, వైభవ్ కేవలం 75 బంతుల్లోనే 18 సిక్సర్లు బాది అతడిని అధిగమించాడు.

Vaibhav Suryavanshi : ఏంది సామీ ఈ బ్యాటింగ్? ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Apr 12, 2026 | 12:48 PM

Share

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మార్మోగిపోతోంది.. అతనే రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న ఈ బుడతడు, తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ రికార్డును బ్రేక్ చేశాడు. త్వరలో హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముందే వైభవ్ సృష్టించిన ఈ సునామీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడడానికి ముందే వైభవ్ సూర్యవంశీ ఒక భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఆడిన తొలి 75 బంతుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు హెన్రిచ్ క్లాసెన్ (2024లో 17 సిక్సర్లు) పేరిట ఉండగా, వైభవ్ కేవలం 75 బంతుల్లోనే 18 సిక్సర్లు బాది అతడిని అధిగమించాడు. ఈ కుర్రాడి దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో మరెన్ని రికార్డులు బద్దలవుతాయో అని విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.

వైభవ్ ఆడుతున్నది కేవలం రెండో ఐపీఎల్ సీజన్ మాత్రమే. అయినప్పటికీ, సీజన్ ఆరంభంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-3 ఆటగాళ్ల జాబితాలో వైభవ్ రెండుసార్లు తన పేరును నమోదు చేసుకోవడం విశేషం. 2025 ఐపీఎల్ సీజన్ లో కూడా అతను తొలి 75 బంతుల్లో 16 సిక్సర్లు కొట్టాడు. ఇదే మైలురాయిని గతంలో సంజు శామ్సన్ (2020), గ్లెన్ మాక్స్‌వెల్ (2023) కూడా అందుకున్నారు. కానీ 14 ఏళ్ల వయసులో ఇలాంటి ఫీట్ సాధించడం మాత్రం ఒక్క వైభవ్ కే చెల్లింది.

ఏప్రిల్ 13న హైదరాబాద్ వేదికగా జరగబోయే మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యధికంగా 5 సార్లు 20 కంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉంది. ఇందుకోసం అతను 78 ఇన్నింగ్స్ లు ఆడాడు. అయితే, వైభవ్ మాత్రం కేవలం 11 ఇన్నింగ్స్ లలోనే 3 సార్లు 20 కంటే తక్కువ బంతుల్లో ఫిఫ్టీలు బాదేశాడు. అంటే అభిషేక్ కంటే వైభవ్ ఎంతో వేగంగా దూసుకుపోతున్నాడని స్పష్టమవుతోంది. రేపటి మ్యాచ్ లో గనుక వైభవ్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడితే అభిషేక్ రికార్డుకు ముప్పు తప్పదు.

ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు యశస్వి జైస్వాల్ (13 బంతులు) పేరిట ఉంది. విచిత్రమేమిటంటే జైస్వాల్, వైభవ్ ఇద్దరూ ఒకే జట్టు (రాజస్థాన్ రాయల్స్) తరపున ఆడుతున్నారు. రేపు హైదరాబాద్ తో జరగబోయే మ్యాచ్ లో జైస్వాల్, వైభవ్ ఓపెనింగ్ జోడీ హైదరాబాద్ బౌలర్లపై ఏ విధంగా విరుచుకుపడుతుందో చూడాలి. లోకల్ బాయ్ అభిషేక్ శర్మ తన రికార్డును కాపాడుకుంటాడా లేక వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర సృష్టిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us