AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను RCB అభిమానిని.. విరాట్ భయ్యా నాతో ఏం చెప్పాడంటే..?

వైభవ్ సూర్యవన్షీ సచిన్ టెండూల్కర్ టీమిండియా రికార్డును బద్దలు కొట్టనున్నాడు. ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలిచిన వైభవ్, గతంలో ఆర్సీబీ అభిమానిగా ఉండేవాడు. ఫైనల్ తర్వాత విరాట్ కోహ్లీ అతనితో ప్రత్యేకంగా మాట్లాడి, మరింత ముందుకు వెళ్ళమని ప్రోత్సహించాడు.

నేను RCB అభిమానిని.. విరాట్ భయ్యా నాతో ఏం చెప్పాడంటే..?
Vaibhav Suryavanshi Virat K
SN Pasha
|

Updated on: Jun 07, 2026 | 3:28 PM

Share

యువ సంచలనం వైభవ్ సూర్యవన్షీ ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉండి ఉంటాడు. ఎందుకంటే.. ది గ్రేట్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి. అతి చిన్న వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆటగాడిగా సచిన్ పేరిట ఉన్న రికార్డు.. దాదాపు 35 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడా రికార్డును వైభవ్ బద్దలు కొడుతున్నాడు. ఆ విషయం పక్కనపెడితే.. వైభవ్ తాజాగా ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. తాను గతంలో ఆర్సీబీ టీమ్‌ను పెద్ద అభిమానిని అంటూ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ తర్వాత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవన్షీతో ప్రత్యేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. వైభవ్‌‌ భుజంపై చేయి వేసి కోహ్లీ మాట్లాడుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. అయితే ఇంతకీ కోహ్లీ, వైభవ్‌తో ఏం మాట్లాడాడు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ విషయంపై కూడా వైభవ్ స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ అంతటి గొప్ప ప్లేయర్ తన భుజంపై చేయి వేసి మాట్లాడుతుంటే తాను నమ్మలేకపోయాయని అన్నాడు. తనను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోహ్లీ తనతో చెప్పినట్లు వైభవ్ చెప్పుకొచ్చాడు.

కాగా వైభవ్ ఐపీఎల్ 2026లో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్‌తో పాటు మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్ అవార్డ్‌లను సైతం వైభవ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అవార్డులు అందుకోవడం కోసం ఫైనల్ మ్యాచ్‌కు వచ్చిన వైభవ్‌తో కోహ్లీ స్పెషల్‌గా మాట్లాడాడు. ఐపీఎల్ 2026 ప్రదర్శనతో పాటు దేశవాలి క్రికెట్‌లోనూ అద్భుతంగా రాణించడంతో వైభవ్‌ను సెలెక్టర్లు భారత టీ20 జట్టులోకి ఎంపిక చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us