సచిన్, గంగూలీ చేయలేనిది.. 9 ఫోర్లు, 5 సిక్సర్లతో ఐపీఎల్ బుడ్డోడి వీరంగం.. ఇక ఇంగ్లండ్‌కు దబిడ దిబిడే
Vaibhav Suryavanshi: గతంలో ఆడిన మూడు అండర్-19 వన్డే మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ మొత్తం 77 పరుగులు సాధించాడు. ఇందులో 5 భారీ సిక్సర్లు, 9 ఫోర్లు ఉండటం అతని దూకుడైన బ్యాటింగ్ శైలికి నిదర్శనం. ఈ ప్రదర్శనతోనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన వైభవ్, ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు.

India U19 vs England U19: భారత యువ క్రికెట్ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మరోసారి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే అండర్-19 జట్టు తరపున అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇప్పుడు ఇంగ్లండ్‌తో వారి గడ్డపైనే తలపడేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. జూన్ 27న హోవ్‌లో జరగనున్న అండర్-19 వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టే భారత జట్టులో వైభవ్ కీలక ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు.
గతంలో ఆడిన మూడు అండర్-19 వన్డే మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ మొత్తం 77 పరుగులు సాధించాడు. ఇందులో 5 భారీ సిక్సర్లు, 9 ఫోర్లు ఉండటం అతని దూకుడైన బ్యాటింగ్ శైలికి నిదర్శనం. ఈ ప్రదర్శనతోనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన వైభవ్, ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ముఖ్యంగా, అతను ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి, అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే శతకం బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 252 పరుగులు చేసి తన అద్భుత ఫామ్‌ను చాటుకున్నాడు.
హోవ్‌లో చారిత్రాత్మక సవాల్..
భారత అండర్-19 జట్టు ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌ను హోవ్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో ఆడనుంది. ఈ మైదానంలో భారత సీనియర్ జట్టుకు మెరుగైన రికార్డు లేదు. 1999 ప్రపంచకప్‌లో ఇక్కడ ఆడిన ఏకైక మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసింది. ఇప్పుడు, యువ భారత జట్టు ఈ మైదానంలో గెలిచి కొత్త చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.
భారత అండర్-19 జట్టు (ఇంగ్లండ్ పర్యటన)..
ఆయుష్ మాత్రే(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌళ్యరాజ్‌సింహ చావ్డా, రాహుల్ కుమార్, అభిగ్యాన్ కుండు (వైస్-కెప్టెన్ & వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మహమ్మద్ ఎనాన్, ఆదిత్య రాణా, అన్మోల్‌జీత్ సింగ్.
బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఈ యువ కెరటం, తన అసాధారణ ప్రతిభతో ఇప్పటికే క్రికెట్ పండితుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే జోరును కొనసాగించి, భవిష్యత్ భారత క్రికెట్‌కు తానొక ఆశాకిరణమని నిరూపించుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








