Vaibhav Suryavanshi: 17 సిక్స్‌లతో చెలరేగిన ఐపీఎల్ బుడ్డోడు.. 25 బంతుల్లో బీభత్సం భయ్యో..
U19 Asia Cup 2025, Vaibhav Suryavanshi: మలేషియాపై వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో అతను 200 స్ట్రైక్ రేట్‌తో తన అర్ధ సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో ఓ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

U19 Asia Cup 2025, Vaibhav Suryavanshi: అండర్-19 ఆసియా కప్ 2025లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ హ్యాండర్ మరోసారి రెచ్చిపోయి ఆడాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు అతడు ఏకంగా 17 సిక్సర్లు బాది ‘సిక్స్ మెషిన్’గా పేరు తెచ్చుకున్నాడు.
మలేషియాపై మెరుపు ఇన్నింగ్స్..
గ్రూప్ దశలో భాగంగా మలేషియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 200 స్ట్రైక్ రేట్‌తో 50 పరుగులు (హాఫ్ సెంచరీ) పూర్తి చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ, మలేషియాపై మాత్రం తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. 11వ ఓవర్లో మరో సిక్సర్ కొట్టే ప్రయత్నంలో మహ్మద్ అక్రమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
టోర్నీలో ఐపీఎల్ బుడ్డోడి రికార్డులు..
సిక్సర్ల మోత: ఈ టోర్నీలో వైభవ్ ఇప్పటివరకు మొత్తం 17 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించే దిశగా దూసుకెళ్తున్నాడు. మలేషియాపై 50 పరుగులు చేసిన తర్వాత, వైభవ్ సూర్యవంశీ అండర్-19 ఆసియా కప్ 2025లో తన ఖాతాలో మరో సిక్స్‌ను జోడించాడు. ఇప్పుడు అతని ఖాతాలో 17 సిక్స్‌లు ఉన్నాయి. ఇది టోర్నమెంట్‌లో అత్యధిక సిక్స్‌ల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
అండర్-19 ఆసియా కప్ 2025 గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత , వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు 226 పరుగులు చేశాడు. వాటిలో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. ఈ మొత్తంలో అతను ఫోర్ల కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో అతను 15 ఫోర్లు, 17 సిక్సర్లు బాదాడు.
200 పరుగులు: మలేషియాపై చేసిన హాఫ్ సెంచరీతో వైభవ్ ఈ ఆసియా కప్‌లో 200 పరుగుల మైలురాయిని కూడా దాటాడు.
యూఏఈపై జరిగిన తొలి మ్యాచ్‌లోనూ వైభవ్ ఇదే తరహాలో చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతన్ని భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జాతీయ జట్టు తరపున కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




