IPL 2026: ఓర్నీ బుడ్డోడా.. ఏకంగా 10 రికార్డులపై కన్నేశావా.. కోహ్లీ, గేల్ హిస్టరీకే ఎసరెట్టేశావుగా..!
Vaibhav Sooryavanshi 10 Challenges in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంతోనే 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగుతున్న ఈ యువ సంచలనం, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే పోరుతో తన వేటను మొదలుపెట్టనున్నాడు. అసాధారణ ఫామ్‌లో ఉన్న వైభవ్ ముందున్న 10 ప్రధాన సవాళ్లతోపాటు రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Vaibhav Sooryavanshi IPL 2026: ఐపీఎల్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ఈరోజు ఐపీఎల్ 2026లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఈ యంగ్ ప్లేయర్ ముందు భారీ సవాళ్లు నిలిచాయి. అందులో ముఖ్యంగా తన జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించడం. 2008 తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు మరోసారి ట్రోఫీ గెలవలేదు. ఐపీఎల్ 2026 లో తన ప్రాధాన్యత జట్టుకు టైటిల్ అందించడమేనని వైభవ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ బుడ్డోడి మెరుపు ఇన్నింగ్స్‌లు తన టీంను విజేతగా నిలబెడతాయో లేదో చూడాలి.
క్రిస్ గేల్ ‘హైయెస్ట్ స్కోరు’ రికార్డుపై కన్నేసిన వైభవ్..
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (175*) రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. ఇటీవల బీసీసీఐ ‘నమన్’ అవార్డుల వేదికగా వైభవ్ మాట్లాడుతూ, ఈ రికార్డును అధిగమించడమే తన లక్ష్యమని చెప్పి షాకిచ్చాడు. ఐపీఎల్ 2026లో ఈ భారీ స్కోరును దాటడం వైభవ్‌కు రెండో పెద్ద సవాలుగా మారింది.
సిక్సర్ల సునామీ: ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధ్యమేనా?
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టలేదు. వైభవ్ కూడా ఇప్పటివరకు ఏ స్థాయిలోనూ ఈ ఘనత సాధించలేదు. ఐపీఎల్ వంటి భారీ వేదికపై ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదడం అతని ముందున్న నాలుగో అతిపెద్ద ఛాలెంజ్. అలాగే ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డుపైనా గురిపెట్టాడు.
ఆరెంజ్ క్యాప్ తోపాటు ఫాస్టెస్ట్ సెంచరీ..
గత సీజన్ అరంగేట్రంలోనే వైభవ్ 35 బంతుల్లో సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఐపీఎల్‌లో క్రిస్ గేల్ పేరిట ఉన్న 30 బంతుల సెంచరీ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పుడు వైభవ్ ముందున్న లక్ష్యం. దీంతో పాటు సీజన్ ముగిసేసరికి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ‘ఆరెంజ్ క్యాప్’ గెలవడం కూడా ఒక సవాలే.
పృథ్వీ షా రికార్డుకు ఎసరు..!
టీనేజర్‌గా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం పృథ్వీ షా (598 పరుగులు) పేరిట ఉంది. వైభవ్ ఖాతాలో ప్రస్తుతం 252 పరుగులు ఉన్నాయి. అంటే ఈ సీజన్‌లో మరో 347 పరుగులు సాధిస్తే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన టీనేజ్ బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టిస్తాడు.
కోహ్లీ, బట్లర్ రికార్డులపై గురి..
ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక శతకాలు (4 సెంచరీలు) బాదిన రికార్డు విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్ పేరిట ఉమ్మడిగా ఉంది. వైభవ్ ఈ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించగలడా అనేది ఆసక్తికరం. అలాగే క్రిస్ గేల్ ఒక సీజన్‌లో బాదిన 59 సిక్సర్ల రికార్డును 15 ఏళ్ల వయస్సులోనే అధిగమించడం వైభవ్ ముందున్న మరో క్లిష్టమైన సవాలు. వీటికి తోడు, అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకోవడం ద్వారా తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని ఈ వండర్ బాయ్ భావిస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
