AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి మ్యాచ్‌లోనే సచిన్, కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టిన వైభవ్.. అదేంటో తెలుసా?

Vaibhav Sooryavanshi records: ఒకవైపు వికెట్లు పడుతున్నా, వయసుతో సంబంధం లేకుండా ప్రపంచ స్థాయి బౌలర్లను వైభవ్ సూర్యవంశీ భయపెట్టిన తీరు భారత క్రీడాభిమానులకు కన్నుల పండువగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లోనే ఇంతటి ధైర్యాన్ని ప్రదర్శించిన ఈ కుర్రాడు, భవిష్యత్తులో టీమిండియాకు ఒక గొప్ప ఓపెనర్‌గా ఎదుగుతాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

తొలి మ్యాచ్‌లోనే సచిన్, కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టిన వైభవ్.. అదేంటో తెలుసా?
Ind Vs Eng 2nd T20i Vaibhav Sooryavanshi Records
Venkata Chari
|

Updated on: Jul 04, 2026 | 8:52 PM

Share

Vaibhav Sooryavanshi Records: భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియాలో అడుగుపెట్టిన బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఈ యువ సంచలనం.. తన తొలి మ్యాచ్‌లోనే దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల అరుదైన రికార్డులను అధిగమించి చరిత్ర పుటల్లోకెక్కాడు.

పదిహేనేళ్లకే జాతీయ జట్టులోకి..

శనివారం సాయంత్రం మాంచెస్టర్ మైదానం ఒక అద్భుత ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. 15 ఏళ్ల 99 రోజుల వయసులో భారత జెర్సీ ధరించిన వైభవ్ సూర్యవంశీ, టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలో మరే భారతీయ ఆటగాడు కూడా ఇంత తక్కువ వయసులో అరంగేట్రం చేయలేదు. అంతర్జాతీయంగా చూసుకుంటే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా తర్వాత ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో క్రికెట్ ఆడిన రెండో ఆటగాడిగా వైభవ్ అరుదైన ఘనత సాధించాడు.

భయంలేని బ్యాటింగ్.. తొలి బంతికే సిక్సర్..

వైభవ్ తన అరంగేట్ర మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి త్వరగా ఔటైనప్పటికీ, అతను క్రీజులో చూపించిన తెగువ, ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. క్రీజులో ఎదుర్కొన్నది కేవలం 10 బంతులే అయినా, ఇంగ్లాండ్ భయంకరమైన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతినే ఏకంగా సిక్సర్‌గా మలిచి తనలో ఎంత టాలెంట్ ఉందో నిరూపించాడు. ఆ తర్వాత జోష్ టంగ్ బౌలింగ్‌లోనూ మరో భారీ సిక్సర్ బాదాడు. మొత్తంగా తన చిన్న ఇన్నింగ్స్‌లో రెండు అద్భుతమైన సిక్సర్లు నమోదు చేసి, చివరకు విల్ జాక్స్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

సచిన్, కోహ్లీలను మించిపోయిన కుర్రాడు..

ఈ మ్యాచ్‌తో వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలను కూడా అధిగమించాడు. 2010లో జింబాబ్వేపై తన తొలి టీ20 మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు, కానీ ఆ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క సిక్సర్ మాత్రమే కొట్టాడు. ఇక క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఆడిన ఏకైక టీ20 మ్యాచ్‌లో 10 పరుగులు చేయగా, అందులో రెండు ఫోర్లు మాత్రమే ఉన్నాయి, ఒక్క సిక్సర్ కూడా లేదు. కానీ వైభవ్ మాత్రం తన తొలి మ్యాచ్‌లోనే ఏకంగా రెండు సిక్సర్లు బాది ఆ ఇద్దరు దిగ్గజాలను వెనక్కి నెట్టాడు. టీ20 అరంగేట్రంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయుల జాబితాలో ఇషాన్ కిషన్ (4), మురళీ విజయ్ (3), రాహుల్ ద్రవిడ్ (3), తిలక్ వర్మ (3) ముందు వరుసలో ఉండగా, ఇప్పుడు వైభవ్ వారి సరసన చేరిపోయాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా, వయసుతో సంబంధం లేకుండా ప్రపంచ స్థాయి బౌలర్లను వైభవ్ సూర్యవంశీ భయపెట్టిన తీరు భారత క్రీడాభిమానులకు కన్నుల పండువగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లోనే ఇంతటి ధైర్యాన్ని ప్రదర్శించిన ఈ కుర్రాడు, భవిష్యత్తులో టీమిండియాకు ఒక గొప్ప ఓపెనర్‌గా ఎదుగుతాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిన్నారి సంచలనం మున్ముందు క్రికెట్ ప్రపంచంలో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us