AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: క్యాచ్ పట్టే క్రమంలో ఢీకొన్న భారత ఆటగాళ్లు.. తృటిలో తప్పిన ప్రమాదం

Watch: ఏషియన్ గేమ్స్ ఫైనల్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్ క్యాచ్ పట్టే క్రమంలో ఒకరినొకరు ఢీకొన్నారు. తొమ్మిదో ఓవర్లో జరిగిన ఈ సంఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. అదృష్టవశాత్తు ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాణాపాయం తప్పుతు ఆటను విజయవంతంగా కొనసాగించారు.

Watch: క్యాచ్ పట్టే క్రమంలో ఢీకొన్న భారత ఆటగాళ్లు.. తృటిలో తప్పిన ప్రమాదం
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Oct 03, 2026 | 2:46 PM

Share

Watch: జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ పసిడి పతాక పోరులో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ కీలక పోరులో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించి చివరకు విజయం సాధించింది. అయితే మ్యాచ్ మధ్యలో జరిగిన ఒక ఊహించని సంఘటన స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు వీక్షకులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

పాకిస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో తొమ్మిదో ఓవర్ బౌలింగ్ కొనసాగుతోంది. భారత యువ స్పిన్నర్ అభిషేక్ శర్మ వేసిన ఆ ఓవర్‌లో పాక్ బ్యాటర్ హసన్ నవాజ్ బంతిని షాట్ ఆడగా అది గాలిలోకి లేచింది. లాంగ్-ఆఫ్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ బంతిని అందుకునేందుకు వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. అదే సమయంలో లాంగ్-ఆన్ నుంచి రవి బిష్ణోయ్ కూడా బంతిని పట్టే ఉద్దేశంతో అదే వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు.

ఇద్దరు ఆటగాళ్ల కళ్లు బంతిపైనే ఉండటంతో ఒకరినొకరు గమనించలేకపోయారు. దీంతో ఇద్దరు ఆటగాళ్లు ఒక్కసారిగా బలంగా ఢీకొన్నారు. వైభవ్ సూర్యవంశీ బంతిని దాదాపు అందుకునే సమయానికి బిష్ణోయ్ తలకాయ తగలడంతో బంతి చేతిలో నుంచి జారిపోయింది. ఈ ప్రమాదకరమైన ఘర్షణ కారణంగా హసన్ నవాజ్ క్యాచ్ డ్రాప్ అయింది. ఆ సమయంలో పాక్ బ్యాటర్లు రెండు పరుగులు సాధించగలిగారు.

ఈ భయానక ఘటనతో మైదానంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇద్దరు ఆటగాళ్లకు పెద్దగా గాయాలు ఏవీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మైదానంలోనే ప్రథమ చికిత్స అందించి, కొద్దిసేపటి విశ్రాంతి తర్వాత ఇద్దరు ఆటగాళ్ళు మళ్లీ ఆటను కొనసాగించారు. ఈ చిన్నపాటి తప్పిదం భారత్‌కు కాస్త నిరాశ కలిగించినా, ఆటగాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం అందరికీ ఊరటనిచ్చింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us