USA vs PAK: ‘దెబ్బ అదుర్స్ కదూ’.. అమెరికా గెలిచినా.. పాక్‌ పని పట్టడంలో మనోళ్లదే కీలక పాత్ర

|

Jun 07, 2024 | 2:46 PM

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో పెను సంచలనం నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటోన్న పసి కూన అమెరికా చేతిలో పటిష్టమైన పాకిస్తాన్‌కు ఊహించని పరాజయం ఎదురైంది

USA vs PAK: దెబ్బ అదుర్స్ కదూ.. అమెరికా గెలిచినా.. పాక్‌ పని పట్టడంలో మనోళ్లదే కీలక పాత్ర
USA vs PAK
Follow us on

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో పెను సంచలనం నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటోన్న పసి కూన అమెరికా చేతిలో
పటిష్టమైన పాకిస్తాన్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. గురువారం (జూన్ 06) డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అమెరికా ఘన విజయం సాధించింది. . ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ కు దిగిన అమెరికా నిర్ణీత 20 ఓవర్గు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌లో ఫలితాన్ని నిర్ణయించాల్సింది. నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ కు దిగిన పాకిస్తాన్‌ జట్టు 1 వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో అమెరికా పాక్ ను మట్టి కరిపించింది.

కాగ పాకిస్తాన్‌ను ఓడించిన అమెరికా జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు నలుగురు ఉండటం విశేషం. కెప్టెన్ మోనాంక్ పటేల్‌తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్ వంటి ఆటగాళ్లు భారతీయ మూలాలు ఉన్న ప్లేయర్లే. పాకిస్తాన్ పై అమెరికా విజయం సాధించడంలో గుజరాత్ కు చెందిన మోనాంక్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. 160 పరుగుల లక్ష్య చేధనలో మోనాంక్ పటేల్(50) సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు.

ఇవి కూడా చదవండి

ఇక ముంబై కు చెందిన పేసర్‌ సౌరభ్ నేత్రావల్కర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 18 ప‌రుగులిచ్చి 2 కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక సూపర్ ఓవర్ లోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సౌరభ్ ఒక వికెట్ పడగొట్టి కేవలం 13 పరుగులే ఇచ్చాడు. తద్వారా అమెరికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే అమెరికా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్‌కు పాకిస్తాన్ మ్యాచ్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. కానీ వీరు కూడా ప్రతిభావంతులైన ప్లేయర్లే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..