IPL 2022 Points Table: ఐపీఎల్- 2022 తుది దశకు చేరుకుంది. టోర్నీ ప్రారంభంలో బలహీన జట్లుగా ముద్రపడిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలను ఆక్రమించి క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాయి. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరుకోగా మిగతా మూడు స్థానాల కోసం మిగతా జట్లు హోరాహీరోగా తలపడనున్నాయి. కాగా ఇప్పటికే ముంబై టోర్నీ నుంచి నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. ఇక చెన్నై ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే అద్భుతాలు జరగాల్సిందే. పంజాబ్‌ది కూడా ఇదే పరిస్థితి. కాబట్టి మూడు స్థానాల కోసం మిగతా ఐదు జట్లు పోటాపోటీగా తలపడనున్నాయి. కాగా నిలకడలేమితో సతమతమవుతోన్న ఢిల్లీ బుధవారం జరిగిన మ్యాచ్ (RR vs DC) లో రాజస్థాన్ రాయల్స్‌ను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. తద్వారా పాయింట్ల పట్టికలో టాప్-5కి చేరుకోవడమే కాకుండా ప్లే ఆఫ్ రేసులో మేం కూడా ఉన్నామంటూ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది.
ఆ జట్లకే ఎక్కువ అవకాశాలు..
రాజస్థాన్‌పై విజయం తర్వాత ఢిల్లీ ఖాతాలో మొత్తం 12 పాయింట్లు చేరాయి. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఐదో స్థానంలో ఉంది. కానీ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న బెంగళూరు, రాజస్థాన్ జట్ల నుంచి దూరాన్ని చాలా వరకు తగ్గించుకుంది. ఈ రెండు జట్లూ 14 పాయింట్లతో ఉన్నాయి. విశేషమేమిటంటే మూడు జట్లూ 12 మ్యాచ్‌ల చొప్పున ఆడాయి. కాకపోతే ఢిల్లీకి నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉండడం సానుకూలాంశం. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్, బెంగళూరు ముందున్న సవాల్ ఏమిటంటే.. రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పకుండా గెలవాల్సిందే. లేకపోతే రెండు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ గెలిస్తే మాత్రం రిషభ్ సేనకే ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. పైగా ఢిల్లీ ఆఖరి రెండు మ్యాచ్‌లు బలహీనమైన పంజాబ్ కింగ్స్ (మే 16), ముంబై ఇండియన్స్ (మే 21)తో జట్లతో ఆడనుంది. కాగా ఢిల్లీ చేతిలో ఓటమితో రాజస్థాన్ NRR కొంచెం తగ్గింది. ఆ జట్టు తన చివరి రెండు మ్యాచ్‌లలో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. అదే సమయంలో బెంగళూరు పంజాబ్, గుజరాత్‌లతో తలపడాల్సి ఉంది. ఇక 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్ రేసులోన ఉంది. సన్‌రైజర్స్ తన చివరి మూడు మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబై, పంజాబ్‌లతో ఆడాల్సి ఉంది. మరి వీటిలో ఏయే జట్లు ప్లే ఆఫ్‌కు చేరుకుంటాయో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: