క్రికెట్‌కు దూరం కావాలనుకుంది.. సీన్ రివర్సయింది.. 6 మ్యాచ్‌ల్లో 292 పరుగులు.. ఈ టీమిండియా ప్లేయర్ ఎవరంటే?
ఐసీసీ టోర్నమెంట్స్‌లో టీమిండియా సీనియర్ జట్టు ఎప్పుడూ విఫలమవుతూనే ఉంది. అయితే ఈసారి మహిళల అండర్-19 టీం..
ఐసీసీ టోర్నమెంట్స్‌లో టీమిండియా సీనియర్ జట్టు ఎప్పుడూ విఫలమవుతూనే ఉంది. అయితే ఈసారి మహిళల అండర్-19 టీం మాత్రం ప్రపంచ విజేత కావడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న తొలి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత మహిళల జట్టు ప్రస్తుతం ఫైనల్‌కు చేరి.. ఛాంపియన్‌గా మారడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. మొదటి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన టీమిండియా.. ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో తలబడే అవకాశం ఉంది. ఇక ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచిందంటే.. ఢిల్లీకి చెందిన 18 ఏళ్ల శ్వేతా సెహ్రావత్ పేరు మారుమ్రోగుతుంది.
దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌లో శుక్రవారం జనవరి 27న జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడింది. ఇందులో తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్‌ను కేవలం 107 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ శ్వేత సెహ్రావత్ భారత్ తరపున 61 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది.
సెమీ-ఫైనల్స్‌లో, వెటరన్ బ్యాట్స్‌మెన్ షెఫాలీ వర్మ ముందుగానే పెవిలియన్ చేరినా.. శ్వేత మాత్రం మరో ఎండ్ నుంచి పరుగుల వరద పారించింది. లక్ష్యచేధనను అండర్-19 భారత జట్టు కేవలం 45 బంతుల్లోనే పూర్తి చేసింది. ఇక టీమిండియా ఓపెనర్ శ్వేత సెహ్రావత్ తొలి మ్యాచ్ నుంచి బ్యాట్‌తో అదరగొడుతోంది. గ్రూప్ దశలోనే ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్వేత కేవలం 57 బంతుల్లోనే 92 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఒక్క సఫారీలపైనే కాదు.. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లోనూ శ్వేత.. 74 (నాటౌట్), 31 (నాటౌట్), 21, 13, 61(నాటౌట్) పరుగులు చేసింది. దీంతో 6 మ్యాచ్‌ల్లో 292 పరుగులు చేసిన శ్వేత.. 141 స్ట్రైక్‌రేట్‌తో ఇప్పటివరకు 20 ఫోర్లు కొట్టింది.
కాగా, ఒకప్పుడు శ్వేత అటు క్రికెట్, ఇటు ఎగ్జామ్స్ మధ్య ఏది ఎంచుకోవాలనుకునే సంశయంలో పడింది. అయితే ఆ సమయంలో ఎన్‌సీఏ అధ్యక్షుడు వీ.వీ.ఎస్.లక్ష్మణ్ ఆమె కుటుంబాన్ని ఒప్పించి.. శ్వేతను సిబారానికి రప్పించాడు. క్రికెట్‌లో కావాల్సిన మెలుకువలు నేర్పించాడు. ఆ తర్వాత జరిగిన ఓ మ్యాచ్‌లో శ్వేత అద్భుతమైన సెంచరీ సాధించి తన ప్రతిభను చాటుకుంది.
India are the first team to make it to the final of the ICC Women’s #U19T20WorldCup ?? pic.twitter.com/yQccRoUS0l
— T20 World Cup (@T20WorldCup) January 27, 2023