IND vs NZ 1st T20I: టాస్ గెలిచిన టీమిండియా.. ఆ యంగ్ ప్లేయర్లకు భారీ షాకిచ్చిన హార్దిక్.. ప్లేయింగ్ 11 ఇదే..
India vs New Zealand, 1st T20I Playing 11: భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ నగరమైన రాంచీలో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
IND vs NZ Playing 11: భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ నగరమైన రాంచీలో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ టీం మొదట బ్యాటింగ్ చేయనుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు స్వదేశంలో కివీస్‌పై విజయం సాధించాలని కోరుకుంటోంది. అదే సమయంలో, మిచెల్ సాంట్నర్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ 6 సంవత్సరాల తర్వాత స్వదేశంలో భారత్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తుంది.
ఈ సిరీస్‌లో జట్టు బిగ్-3 (రోహిత్, కోహ్లి, రాహుల్) జట్టులో భాగం కావడం లేదు. యువకులలో సమర్థవంతమైన జట్టు కలయికను రూపొందిచే సవాలును పాండ్యా ముందుంది. మరోవైపు, ట్రెంట్ బౌల్డ్, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్ వంటి సీనియర్లను కూడా కివీస్ జట్టులో లేరు.
పృథ్వీ షాకు నో ఛాన్స్..
భారత ప్లేయింగ్-11లో పృథ్వీ షాకు అవకాశం దక్కలేదు. ఇషాన్ కిషన్, శుభమాన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. అలాగే యంగ్ ప్లేయర్లు జితేష్, ముఖేష్, సీనియర్ ప్లేయర్ చాహల్‌కు తొలి టీ20లో చోటుదక్కలేదు.
రాంచీలో టీమ్‌ఇండియా..
గణాంకాల ప్రకారం రెండు జట్లూ సమంగా ఉన్నాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు 22 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 10, న్యూజిలాండ్ జట్టు 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 3 మ్యాచ్‌లు టై అయ్యాయి. మరోవైపు, రాంచీ మైదానం గురించి మాట్లాడితే, ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు 3 టీ20 మ్యాచ్‌లు ఆడి మూడింటిలోనూ విజయం సాధించింది.
టీంతో మాట్లాడుతున్న ఇషాన్..
Ishan Kishan leads the huddle talk in Ranchi ?
Toss coming up shortly.#INDvNZ @mastercardindia pic.twitter.com/HQGDSk9vtp
— BCCI (@BCCI) January 27, 2023
టీమిండియా ప్లేయింగ్ XI:
ఇషాన్ కిషన్(కీపర్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్
Captain @hardikpandya7 wins the toss and elects to bowl first in the 1st T20 against New Zealand.
A look at our Playing XI for the game ??
Live – https://t.co/9Nlw3mU634 #INDvNZ @mastercardindia pic.twitter.com/fNd9v9FTZz
— BCCI (@BCCI) January 27, 2023
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI:
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(కీపర్), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..