Team India: నా దేవుడు ఎంఎస్ ధోని.. జెర్సీ నంబర్ మాత్రం ఆయన వల్లే మార్చాను.. సీక్రెట్ రివీల్ చేసిన టీమిండియా ప్లేయర్..
Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ తన జెర్సీ నంబర్ రహస్యాన్ని ఎట్టకేలకు వెల్లడించాడు. అలాగే ఎంఎస్ ధోని ఆటోగ్రాఫ్ తీసుకోవడం గురించి కూడా చెప్పుకొచ్చాడు.
Ishan Kishan Jersey Number Secret: టీమ్ ఇండియా యంగ్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ తన జెర్సీ నంబర్ రహస్యాన్ని వెల్లడించాడు. అలాగే అందలో లెజెండరీ ప్లేయర్ ధోని ఆటోగ్రాఫ్ ఎలా పొందాడో కూడా చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్‌తో వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్.. రాంచీలో న్యూజిలాండ్‌తో జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌కు ముందు ఈ విషయాన్ని వెల్లడించాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
జెర్సీ నంబర్ 23పై మనసు..
బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో ఇషాన్ కిషన్ మాట్లాడుతూ, ‘నాకు 23 నంబర్ జెర్సీ వేసుకోవాలని ఉంది. అయితే కుల్దీప్ యాదవ్ వద్ద అప్పటికే 23వ నంబర్ జెర్సీ ఉంది. అందుకే అమ్మను జెర్సీ నంబర్ గురించి అడిగాను. 32 నంబర్ తీసుకొమ్మని చెప్పింది. అందుకే జెర్సీ నంబర్ 32 వేసుకున్నాను. నేను 14 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారాలని నిర్ణయించుకున్నాను’ అని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత జార్ఖండ్ మారింది. నేను మొదట అండర్-19 కోసం ఆడాను. ఆ తర్వాత భారత్‌కు. నేను ఇండియన్‌లో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
నా దేవుడు ఎంఎస్ ధోని..
Secret behind jersey number ? Getting the legendary @msdhoni‘s autograph ✍️ Favourite cuisine ?
Get to know @ishankishan51 ahead of #INDvNZ T20I opener in Ranchi ????#TeamIndia pic.twitter.com/neltBDKyiI
— BCCI (@BCCI) January 26, 2023
ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ మాట్లాడుతూ, ‘నా ఆరాధ్య దైవం ఎస్ఎస్ ధోనీ. నేను కూడా అతనిలాగే జార్ఖండ్ తరపున ఆడాను. నేను నిజంగా అతని అడుగుజాడల్లో నడవాలని అనుకున్నాను. నా జట్టు కూడా మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నాను. ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను.. నేను ఎవరికీ భయపడను. నేను ప్రతి సవాలును స్వీకరిస్తాను’ అని పేర్కొన్నాడు. ఇషాన్ మాట్లాడుతూ ‘నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎంఎస్ ధోనీని ఆటోగ్రాఫ్ అడిగాను. ఇది నాకు మరపురాని క్షణం అంటూ తెలిపాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..