Telugu News » Photo gallery » Cricket photos » Bihar's young batsman Saqibul Gani scored a double century and reached record 1000 runs in just 15 innings bihar vs manipur ranji trophy
అరంగేట్రంలో ట్రిపుల్.. నేడు సెహ్వాగ్ స్టైల్‌లో డబుల్ సెంచరీతో బీభత్సం.. కట్‌చేస్తే.. 1000 పరుగులతో ప్రపంచ రికార్డ్..
Venkata Chari |
Updated on: Jan 26, 2023 | 6:11 PM
Bihar vs Manipur Ranji Trophy: రంజీ ట్రోఫీలో మణిపూర్‌పై బీహార్ యువ బ్యాట్స్‌మెన్ సకీబుల్ గని డబుల్ సెంచరీ సాధించాడు. ఘనీ 238 బంతుల్లో 205 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు.
Jan 26, 2023 | 6:11 PM
బీహార్ యువ బ్యాట్స్‌మెన్ సకీబుల్ గనీ మరోసారి చర్చల్లో నిలిచాడు. మణిపూర్‌పై తుఫాన్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో గనీ తన పేరిట ఓ భారీ రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు.
1 / 5
సకీబుల్ గనీ మణిపూర్‌పై కేవలం 238 బంతుల్లో 205 పరుగులు చేశాడు. ఈ బ్యాట్స్‌మెన్ బ్యాట్ నుంచి 29 ఫోర్లు, 2 సిక్సర్లు వచ్చాయి. గనీ స్ట్రైక్ రేట్ 86.13గా నిలిచింది.
2 / 5
ఈ ఇన్నింగ్స్‌లో సకీబుల్ గనీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1000 పరుగులు కూడా పూర్తి చేశాడు. గనీ కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగుల సంఖ్యను చేరుకున్నాడు.
3 / 5
సకీబుల్ గనీ గతేడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ఆటగాడు అరంగేట్రం మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. ఆ ఇన్నింగ్స్‌లో 341 పరుగులు చేశాడు.
4 / 5
సకీబుల్ ఘనీ అద్భుత ఇన్నింగ్స్‌తో బీహార్ తొలి ఇన్నింగ్స్‌లో 546 పరుగులు చేసింది. బీహార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బిపిన్ సౌరభ్ కూడా 155 పరుగులు చేశాడు.