- Telugu News Photo Gallery Cricket photos IND vs NZ 1st T20I Plying 11 India opener ruturaj gaikwad ruled out of t20i series vs new zealand
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. గాయంతో టీ20 సిరీస్‌కు దూరమైన డేంజరస్ ఓపెనర్..
IND vs NZ 1st T20I Plying 11: మణికట్టు గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరగనుంది.
Updated on: Jan 26, 2023 | 5:43 PM

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి రాంచీలో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. విజయం కోసం ఇరు జట్లూ ధీటుగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

టీ20 సిరీస్‌కు భారత జట్టు ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు. గైక్వాడ్ మణికట్టుకు గాయమైంది. గైక్వాడ్ తప్పుకోవడం టీమ్ ఇండియా కంటే ఈ యంగ్ ప్లేయర్‌కే తీవ్ర నష్టంగా మారింది.

నిజానికి గైక్వాడ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వర్షం కురిపించాడు. యూపీపై ఈ ఆటగాడు 6 బంతుల్లో 7 సిక్సర్లు కొట్టిన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ డబుల్ సెంచరీ సాధించాడు.

కాగా, గైక్వాడ్‌తో పాటు టీమిండియాకు మరో ముగ్గురు ఓపెనర్లు ఉన్నారు. శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా కూడా టీ20 జట్టులో ఉన్నారు.

న్యూజిలాండ్ టీ20 సిరీస్ కోసం భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), దీపక్ హుడా, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జితేష్ శర్మ, పృథ్వీ షా, శివమ్ మావి, శుభ్‌మన్ గిల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి.




