- Telugu News Photo Gallery Cricket photos Shubman Gill Breaks Another ODI record of Virat Kohli as he smashed 360 runs against New Zealand
Shubman Gill: కోహ్లీ రికార్డులపైనే కన్నేసిన శుభమాన్ గిల్.. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో రెండు రికార్డులు బద్దలు..
న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తరఫున విజృంభించిన శుభమాన్ గిల్.. వరసుగా విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ఈ వన్డే సిరీస్‌లో అతను కోహ్లీ పేరిట ఉన్న రెండు రికార్డుల లెక్కలను మార్చేశాడు.
Updated on: Jan 26, 2023 | 5:15 PM

శుభ్‌మన్ గిల్ రికార్డ్స్: న్యూజిలాండ్‌తో ముగిసిన 3 మ్యాచ్ వన్డే సిరీస్‌లో 1 డబుల్ సెంచరీ, ఒక సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్ మొత్తం 360 పరుగులు చేశాడు.

ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన 3వ వన్డేలో భారీ సెంచరీతో విజృంభించిన శుభ్‌మన్ గిల్ మరో రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఆ రికార్డును బద్దలు కొట్టడం కూడా మరో విశేషం.

ఇండోర్ మ్యాచ్‌లో 78 బంతులు ఎదుర్కొన్న శుభ్‌మన్ గిల్ 5 భారీ సిక్సర్లు, 13 ఫోర్లతో 112 పరుగులు చేశాడు. అంతకముందే జరిగిన 2వ వన్డేలో 40 పరుగులు, మొదటి ODIలోడబుల్ సెంచరీ( 208 పరుగుల) చేశాడు. దీంతో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో అతను 360 పరుగులు చేసినట్లయింది.

ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న శుభ్‌మన్ గిల్ 7 భారీ సిక్సర్లు, 12 ఫోర్లతో అజేయంగా 126 పరుగులు చేశాడు.


న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల్లో 1 డబుల్ సెంచరీ, ఒక సెంచరీతో మొత్తం 360 పరుగులు చేశాడు శుభ్‌మన్ గిల్. దీంతో కింగ్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును గిల్ అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఫలితంగా 25000 పరుగులు సాధించిన క్రికెటర్ల ఎలైట్ గ్రూప్‌లో కూడా కోహ్లీ ప్రథమ స్థానంలో ఉన్నట్లయింది.

అయితే కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే శుభ్‌మన్ గిల్ వెయ్యి పరుగులు పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. అంటే కింగ్ కోహ్లి కంటే గిల్ 5 ఇన్నింగ్స్ తక్కువలోనే ఈ ఘనత సాధించాడు.

ఈ క్రమంలోనే శుభమాన్ గిల్ తాజాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా అవతరించాడు.





























