Video: రాంచీలో టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన జార్ఖండ్ డైనమేట్.. మాట్లాడేందుకు ధైర్యం చేయని బౌలర్.. ఎవరంటే?

Ms Dhoni: టీమ్ ఇండియా మ్యాచ్ ఆడేందుకు రాంచీకి వచ్చినప్పుడల్లా, ఎంఎస్ ధోనీ భారత ఆటగాళ్లను కలవడానికి చేరుకుంటాడు. ఈసారి కూడా యువ ఆటగాళ్లను కలిసేందుకు ధోనీ వచ్చేశాడు.

Video: రాంచీలో టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన జార్ఖండ్ డైనమేట్.. మాట్లాడేందుకు ధైర్యం చేయని బౌలర్.. ఎవరంటే?
Ms Dhoni Ind Vs Nz 1st T20i
Follow us
Venkata Chari

|

Updated on: Jan 26, 2023 | 9:39 PM

India vs New Zealand: మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌ చేసి రెండున్నరేళ్లు పూర్తయింది. దాదాపు మూడున్నరేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడడం లేదు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే కనిపిస్తున్నాడు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటాడు. ఇదంతా పక్కన పెడితే, భారత్, న్యూజిలాండ్ టీంల మధ్య టీ20 సిరీస్ శుక్రవారం నుంచి మొదలుకానుంది. ఈ క్రమంలో తొలి టీ20 రాంచీలో జరగనుంది. ఈ క్రమంలో అక్కడి చేసుకున్న టీమ్ ఇండియాను కలిసేందుకు ధోనీ వచ్చాడు. దీంతో ఆటగాళ్లలో ఉత్సాహం ఉప్పొంగిపోయింది. టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, లోకల్ స్టార్ ఇషాన్ కిషన్, ధోనీతో మాట్లాడుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

భారత మాజీ కెప్టెన్ రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్‌కి చేరుకుని తన పాత సహచరులను కలుసుకున్నాడు. ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా ధోనీ తన సహచరులను నిరాశపరచకుండా డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ధోనీని చూడగానే షాకైన ఆటగాళ్లు..

రాంచీలో టీ20 మ్యాచ్‌కు ఒకరోజు ముందు ధోనీ డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకోగానే.. అతడిని కలిసేందుకు టీమిండియా ఆటగాళ్లు ఎగబడ్డారు. ధోనీతో మంచి స్నేహబంధం ఉన్న హార్దిక్ పాండ్యా చాలా సేపు మాట్లాడగా, ధోనీ నగరం నుంచి వచ్చిన కొత్త వికెట్ కీపర్ స్టార్ ఇషాన్ కిషన్ కూడా అతనితో సరదాగా నవ్వుతూ కనిపించాడు.

ధోని వీడియో..

హార్దిక్, ఇషాన్ ధోనీతో కొంతసేపు మాట్లాడుతున్నప్పుడు, వారి వెనుక యువ ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి కొంత టెన్షన్‌లో కనిపించాడు. అతని వెంట్రుకలు నిక్కబొడుచుకున్నట్లు అనిపించింది. అతను ధోనీతో మాట్లాడాలనుకున్నాడు.. కానీ, ధైర్యం చేయలేకపోయాడు.

స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, మావి పక్కన నిలబడి, తన జూనియర్ సహచరుడి పరిస్థితిని అర్థం చేసుకుని, ధోనీతో మాట్లాడమని మావికి ధైర్యం చెప్పడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే, ధోనీతో మావి ధైర్యం చేసి మాట్లాడాడో లేదో చెప్పడం కష్టమే.. కానీ, ధోనీని కలుసుకుని మాట్లాడాలనే కోరిక తీరిందని భావిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..