AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: వికట్ల వెనుకాల ధోని.. నోబాల్ ఇవ్వని అంపైర్.. కట్‌చేస్తే.. ఫిక్సింగ్‌తో మ్యాచ్ గెలిచారంటూ

Umpire Controversial Decision: ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన 30వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ, ఈ మ్యాచ్‌లో, అంపైర్ నిర్ణయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి.

IPL 2025: వికట్ల వెనుకాల ధోని.. నోబాల్ ఇవ్వని అంపైర్.. కట్‌చేస్తే.. ఫిక్సింగ్‌తో మ్యాచ్ గెలిచారంటూ
Ipl 2025 Csk Vs Lsg
Venkata Chari
|

Updated on: Apr 15, 2025 | 1:03 PM

Share

ఐపీఎల్ (IPL) 2025లో వరుసగా 3 విజయాల తర్వాత, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఎంఎస్ ధోని డేంజరస్ ఇన్నింగ్స్ కారణంగా చెన్నై 5 వికెట్ల తేడాతో గెలిచింది. కానీ, ఈ మ్యాచ్ సమయంలో అంపైర్ తీసుకున్న ఒక నిర్ణయం వార్తల్లో నిలిచింది. క్రికెట్ దిగ్గజాలు కూడా ఈనిర్ణయం పట్ల మౌనంగా ఉన్నారు.

అంపైర్ నిర్ణయంపై గందరగోళం..

నిజానికి, ఈ గందరగోళం లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కనిపించింది. అప్పుడు మతిష పతిరానా చెన్నై తరపున 20వ ఓవర్ వేస్తున్నాడు. ఈ ఓవర్‌లోని మొదటి బంతిని మతిష పతిరానా పిచ్ వెలుపల బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అంపైర్ దానిని వైడ్ బాల్‌గా ప్రకటించాడు. కానీ, బంతి పిచ్ వెలుపల ఉన్నట్లు అనిపించింది. కాబట్టి పంత్ నో బాల్ డిమాండ్ చేస్తూ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ తనిఖీ చేసి నిర్ణయాన్ని మార్చలేదు. కానీ, రీప్లేలో బంతి పిచ్ వెలుపల పడిందని స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత వ్యాఖ్యాతలు కూడా ఈ నిర్ణయంపై అసంతృత్తి ప్రకటించారు.

అంపైర్ నిర్ణయంపై వ్యాఖ్యానిస్తూ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, ‘ఈ బంతి నో బాల్ అయి ఉండాలి. అంపైర్ దానిని ఎందుకు వైడ్‌గా ప్రకటించాడో నాకు తెలియదు. ఇది స్పష్టమైన నో బాల్. రిషబ్ పంత్ డిమాండ్ పూర్తిగా న్యాయమైనది. అంపైర్ ఇక్కడ నిర్ణయం ఎలా తీసుకున్నాడో నాకు తెలియదు. మరోవైపు, సంజయ్ బంగర్, ‘అవును, ఈ బంతి నో బాల్ అయి ఉండాలి’ అని అన్నాడు. ఎందుకంటే అది పిచ్ బయట పడింది. సోషల్ మీడియాలో కూడా అభిమానులు ఈ నిర్ణయం తప్పు అని కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో, కొంతమంది అభిమానులు ధోని వికెట్ వెనుక నిలబడి ఉన్నాడని, దాని కారణంగా అంపైర్ ఒత్తిడిలో ఈ పొరపాటు చేశాడని అంటున్నారు.

5 ఓటముల తర్వాత చెన్నై విజయం..

ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ తమ వరుస ఓటములకు బ్రేక్ వేసింది. దీనికి ముందు చెన్నై వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై అద్భుతంగా ఆడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు లక్నో సూపర్ జెయింట్స్‌ను 166 పరుగులకే పరిమితం చేయగలిగారు. ఆ తర్వాత, ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సాధించింది. ఇందులో ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనకు ధోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..