IPL 2025: ప్లే ఆఫ్స్ చేరే తొలి జట్టు ఇదే.. మరో 3 స్థానాల కోసం ఎన్ని టీంలు పోటీపడుతున్నాయంటే?
IPL 2025 Playoff Scenarios: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడానికి 16 పాయింట్లు సరిపోతాయి. అన్ని జట్ల 6 మ్యాచ్‌లు ఇప్పుడు పూర్తయ్యాయి. ఇంతలో, టోర్నమెంట్‌లో 30 మ్యాచ్‌లు కూడా పూర్తయ్యాయి. దీని తర్వాత, ప్లేఆఫ్‌ల లెక్కలు కూడా ప్రారంభమయ్యాయి. దీని ప్రకారం, ఈసారి ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించాలంటే ఒక జట్టు ఇంకా ఎన్ని ఆటలను గెలవాలో పరిశీలిస్తే..

IPL 2025 Playoff Scenarios: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి రౌండ్ లోని 30 మ్యాచ్‌లు ముగిశాయి. ముప్పై మ్యాచ్‌లు ముగిసే సమయానికి, చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తప్ప, మిగిలిన జట్లు 6 మ్యాచ్‌లు ఆడాయి.
అంటే, చెన్న, లక్నో జట్ల మొదటి రౌండ్ పూర్తయింది. మొదటి రౌండ్ ముగిసే సమయానికి, చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ నాల్గవ స్థానంలో ఉంది. చెన్నై ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపుగా బయట పడినట్లే, కానీ ఒకింత ఆశలు మాత్రం సజీవంగానే నిలిచాయి. మరి ప్లే ఆఫ్స్ చేరాలంటే ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలో ఓసారి చూద్దాం..
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గుజారత్ జట్టుకు ఇంకా 8 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 8 మ్యాచ్‌ల్లో 4 గెలిస్తే, 16 పాయింట్లతో తదుపరి దశకు చేరుకోవచ్చు.
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5 మ్యాచ్‌లు ఆడి 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అందువల్ల, ఢిల్లీ క్యాపిటల్స్ వారి తదుపరి 9 మ్యాచ్‌లలో 4 గెలిస్తే, 16 పాయింట్లతో ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో 4 మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది.
లక్నో సూపర్ జెయింట్స్: రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించింది. మిగిలిన 7 మ్యాచ్‌ల్లో 4 గెలిస్తే, 16 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరుకుంటారు.
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానె నేతృత్వంలోని కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించింది. మిగిలిన 8 మ్యాచ్‌ల్లో 5 గెలిస్తే, వారికి 16 పాయింట్లు లభిస్తాయి. ఈ విధంగా టాప్ 4 లో కనిపించవచ్చు.
పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించింది. మిగిలిన 9 మ్యాచ్‌ల్లో 5 గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్‌లోకి ప్రవేశిస్తారు.
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు నమోదు చేసింది. రాజస్తాన్ ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లలో 6 గెలిస్తే ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించవచ్చు.
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి, వాటిలో 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మిగిలిన 8 మ్యాచ్‌ల్లో 6 గెలిస్తే, 16 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరుకోవచ్చు.
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన 8 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ జట్టు 6 విజయాలు నమోదు చేస్తే ప్లేఆఫ్‌లోకి ప్రవేశించవచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్: మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచింది. చెన్నై ఇంకా 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లలో 6 గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధించవచ్చు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..