AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాక్ జెర్సీని నేలకొసి కొట్టిన అంపైర్‌.. కాళ్లు పట్టుకుని మర్దన చేసిన క్రికెటర్లు.. వైరల్‌ వీడియో

క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు తరచుగా గాయపడుతుంటారు. ఒక్కోసారి అంపైర్లకు కూడా దెబ్బలు తగులుతుంటాయి. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలోనూ అలాంటిదే జరిగింది. ఈ మ్యాచ్‌లో, న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆన్-ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్‌కు బంతి గట్టిగా తగిలింది . దీంతో నొప్పితో మెలికలు తిరిగిపోయాడీ అంపైర్‌.

Viral Video: పాక్ జెర్సీని నేలకొసి కొట్టిన అంపైర్‌.. కాళ్లు పట్టుకుని మర్దన చేసిన క్రికెటర్లు.. వైరల్‌ వీడియో
Pak Vs Nz
Basha Shek
|

Updated on: Jan 12, 2023 | 4:46 PM

Share

క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు తరచుగా గాయపడుతుంటారు. ఒక్కోసారి అంపైర్లకు కూడా దెబ్బలు తగులుతుంటాయి. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలోనూ అలాంటిదే జరిగింది. ఈ మ్యాచ్‌లో, న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆన్-ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్‌కు బంతి గట్టిగా తగిలింది . దీంతో నొప్పితో మెలికలు తిరిగిపోయాడీ అంపైర్‌. ఆ తర్వాత చేతిలో ఉన్న పాక్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ జెర్సీని నేలకేసి కొట్టాడు. అయితే గ్రౌండ్‌లో ఉన్న పాక్‌ ఆటగాళ్లు అంపైర్‌ కాలిని రుద్దుతూ అతనికి సేవలు చేశారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 36వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హారిస్ రవూఫ్ వేసిన ఓవర్‌ నాలుగో బంతికి గ్లెన్ ఫిలిప్స్ మిడ్ వికెట్ వైపుగా ఆడాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు రెండు పరుగులు తీయలని భావించారు. దీంతో పాక్‌ ఫీల్డర్‌ మహ్మద్ వాసిమ్ బంతిని త్వరగా అందుకుని నాన్-స్ట్రైక్ ఎండ్‌కు విసిరాడు. అదే సమయంలో అక్కడే నిలబడి ఉన్న అలీమ్‌దార్‌కు బంతి గట్టిగా తగలింది. దీంతో నొప్పితో విలవిల్లాడుతూ తన చేతిలోని హారీస్ రవూఫ్ జెర్సీని నేలపైకి విసిరాడు దార్‌. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డే సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా అది కాస్తా వైరలైంది.

అలీమ్ దార్‌ పరిస్థితిని చూసి ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా వెంటనే అతని వద్దకు చేరుకున్నాడు. అంపైర్‌ పాదాలపై స్ర్పేతో మర్ధన చేశారు. బాబర్‌ ఆజాం కూడా అంపైర్‌తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే..న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది, అయితే ఆ తర్వాత కాన్వే, విలియమ్సన్ 181 పరుగుల భాగస్వామ్యాన్నినమోదుచేసి పరిస్థితని చక్కదిద్దారు. కాన్వాయ్ అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ( 101 పరుగులు) సాధించాడు. అయితే ఈ జోడీకి బ్రేక్ పడడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ట్రాక్ తప్పింది. కేన్ విలియమ్సన్ కూడా సెంచరీకి దూరమై 85 పరుగుల వద్ద నవాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీని తర్వాత న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. డారిల్ మిచెల్-5, లాథమ్-2, ఫిలిప్స్-3 పరుగులకే ఔటయ్యారు. దీంతో 49.5 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది కివీస్‌. అనంతరం 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 43 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (114 బంతుల్లో 79; 8 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సౌథీ, సోధీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్‌, సాంట్నర్‌, బ్రేస్‌వెల్‌, ఫిలిప్స్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..