IND vs SL 2nd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 26 ఏళ్ల జైత్రయాత్ర కొనసాగేనా? ప్లేయింగ్ XI ఇదే..

భారత్-శ్రీలంక వన్డే సిరీస్‌లో భాగంగా ఈరోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టీం టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs SL 2nd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 26 ఏళ్ల జైత్రయాత్ర కొనసాగేనా? ప్లేయింగ్ XI ఇదే..
India Vs Sl 3rd Odi
Follow us
Venkata Chari

|

Updated on: Jan 12, 2023 | 1:08 PM

India Vs Sri Lanka Kolkata ODI: భారత్-శ్రీలంక వన్డే సిరీస్‌లో భాగంగా ఈరోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టీం టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకతో టీమిండియా వరుసగా పదో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. గత 26 ఏళ్లుగా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భారత జట్టు ఓడిపోలేదు. చివరి ఓటమి 1997లో జరిగింది. ఆ తర్వాత వరుసగా టీమిండియా తన జైత్రయాత్ర కొనసాగుతోంది.

ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును కూడా విరాట్ కోహ్లీ బద్దలు కొట్టే అవకాశం ఉంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇక్కడ తన తుఫాన్ బ్యాటింగ్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఈ మైదానంలో రోహిత్ వన్డేల్లో అతిపెద్ద వ్యక్తిగత ఇన్నింగ్స్‌ని ఆడాడు. 2014 నవంబర్‌లో ఇక్కడ శ్రీలంకపై రోహిత్ 264 పరుగులు చేశాడు.

టెండూల్కర్ తర్వాత విరాట్ శ్రీలంకపై టాప్ స్కోరర్‌గా నిలచే ఛాన్స్..

విరాట్ కోహ్లీ శ్రీలంకపై టాప్-2 స్కోరర్‌గా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం 2,333 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (3,113 పరుగులు) మొదటి స్థానంలో, మహేంద్ర సింగ్ ధోని (2,383 పరుగులు) రెండో స్థానంలో ఉన్నారు. 51వ పరుగు చేసిన వెంటనే విరాట్ రెండో స్థానంలోకి వచ్చేస్తాడు.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల ప్లేయింగ్-11..

శ్రీలంక : అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, కుసల్ మెండిస్ (కీపర్), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, లహిరు కుమార, కసున్ రజిత

భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే