వన్డేల్లో మరో డబుల్ సెంచరీ.. 30 ఫోర్లు, 4 సిక్సర్లతో వీరవిహారం.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే?
టీమిండియా తరపున మరో డబుల్ సెంచరీ నమోదైంది. రోహిత్ శర్మ, సచిన్, జగదీషన్, రుతురాజ్ గైక్వాడ్ తర్వాత..
టీమిండియా తరపున మరో డబుల్ సెంచరీ నమోదైంది. రోహిత్ శర్మ, సచిన్, జగదీషన్, రుతురాజ్ గైక్వాడ్ తర్వాత ఈసారి ఉమెన్స్ జట్టుకు చెందిన ఓపెనింగ్ బ్యాటర్ రాఘవి బుధవారం బ్యాట్‌తో దుమారం సృష్టించింది. మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో రాఘవి బౌలర్లను ఊచకోత కోసింది. ఆమె బ్యాటింగ్ ముందు నాగాలాండ్ బౌలర్ల వ్యూహాలు పటాపంచలు అయ్యాయి. ఉత్తరాఖండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘవి బుధవారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ చేసింది. రాఘవి మెరుపు బ్యాటింగ్‌తో ఉత్తరాఖండ్ 50 ఓవర్లలో 2 వికెట్లకు 428 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 30 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అంటే కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే 144 పరుగులు చేసింది.
రాఘవి, తనతో పాటు బరిలోకి దిగిన మరో ఓపెనర్ నీలమ్(123)తో కలిసి ఉత్తరాఖండ్ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించింది. వీరిద్దరి కలిసి మొదటి వికెట్‌కు 234 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అటు షాగున్(59) అర్ధ సెంచరీ సాధించడంతో ఉత్తరాఖండ్ భారీ స్కోర్ సాధించగలిగింది. ఇక 429 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నాగాలాండ్ ఆరంభంలోనే తుస్సుమన్నది. 4 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 28 పరుగులకు ఆలౌట్ అయింది. ఉత్తరాఖండ్‌కు చెందిన బౌలర్ సాక్షి(4 వికెట్లు), పూజ రాజ్(3 వికెట్లు) నాగాలాండ్ పతనంలో కీలక పాత్ర పోషించారు.
?Double Century by Raghvi Bisht (Uttarakhand) in 2022/23 Women’s U19 One Day Trophy vs Nagaland.
?219 runs, 154 balls, 142.21 SR, 30 fours & 4 sixes#U19Oneday #CricketTwitter #U19 #Cricket pic.twitter.com/LbmSF82kG5
— Indian Domestic Cricket Forum – IDCF (@IndianIdcf) December 7, 2022
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..