IND vs AUS: ఆస్ట్రేలియా తరపున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు.. కాని టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్నాడు.. ఎవరో తెలుసా!
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టులోకి ఓ చిచ్చర పిడుగు దూసుకొచ్చాడు. ఇంత వరకు ఆస్ట్రేలియా తరపున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని సదరు ప్లేయర్ ఒక్కసారిగా టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇంతకీ ఆ స్టార్ క్రికెటర్ ఎవరు.? అతని గురించి ఇంతలా...
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టులోకి ఓ చిచ్చర పిడుగు దూసుకొచ్చాడు. ఇంత వరకు ఆస్ట్రేలియా తరపున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని సదరు ప్లేయర్ ఒక్కసారిగా టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇంతకీ ఆ స్టార్ క్రికెటర్ ఎవరు.? అతని గురించి ఇంతలా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది.? లాంటి ఆసక్తికర విషయాలు మీకోసం.. ఐపీఎల్ 2022లో తన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు టిమ్ డేవిడ్. కుడిచేతి వాటం కలిగిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ గురించి ఆస్ట్రేలియా జట్టు సెలెక్టర్ బెయిలీ మాట్లాడుతూ.. ‘టిమ్ డేవిడ్ ఒక అద్భుతమైన ఆటగాడు. బంతిని బౌండరీలకు తరలించడంలో దిట్ట. ఇప్పటి వరకు అతను ప్రదర్శించిన ఆటతీరునే కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం’ అని చెప్పుకొచ్చాడు.
ఇక టిమ్ డేవిడ్ కెరీర్ విషయానికొస్తే సింగపూర్‌లో జన్మించిన ఈ బ్యాట్స్‌మెన్ టీ20లో 164.17 స్ట్రైక్ రేట్‌తో దుమ్మురేపాడు. టీ20లో 120 ఫోర్లు, 160 సిక్సర్లను బాది అంతర్జాతీయ క్రికెట్‌ను తనవైపు తిప్పుకున్నాడు. టీ20లో 14 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ 158.52 స్ట్రైక్ రేట్‌తో 558 పరుగులు చేశాడు. ఇప్పుడీ స్టార్ ప్లేయర్‌ను ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్‌తో పాటు, ఇండియా టూర్ కోసం తమ జట్టులోకి తీసుకుంది. ఇక ఈ 26 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ఐపీఎల్ 2022లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇందులో మొత్తం 86 బంతులు ఆడిన టిమ్ 16 సిక్సర్లు బాది 278 పరుగులు సాధించాడు. మరి తొలిసారి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతోన్న ఈ స్టార్ ప్లేయర్ తన మార్క్‌ను ఏమాత్రం చూపిస్తాడో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..