Mega Blockbuster: వెండి తెరపై అడుగు పెట్టనున్న రోహిత్ శర్మ, గంగూలీ.. ఈ నెల 4న ట్రైలర్ విడుదల
రోహిత్, గంగూలీ ఇద్దరూ షేర్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు వీరిద్దరూ ఏ విషయానికి సంబంధించి పోస్టర్ ను పోస్ట్ చేశారని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్
Mega Blockbuster: భారత క్రికెట్ జట్టు ఆసియా కప్-2022 టోర్నీతో బిజీబిజీగా ఉంది. ఇప్పటి భారత క్రికెట్ జట్టు సూపర్-4లోకి దూసుకెళ్లింది. భారత్ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి అనంతరం హాంకాంగ్‌ను ఓడించింది. అంతేకాదు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కొన్ని మైలురాళ్ళను అధిగమించాడు. కెప్టెన్‌గా 37 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 31 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. అయితే తాజాగా రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసి సరికొత్త బజ్ ను క్రియేట్ చేశాడు.
రోహిత్ షేర్ చేసిన ఫోటో ఓ సినిమా పోస్టర్ లా కనిపిస్తోంది. ఆ పోస్టర్ లో రోహిత్ ఒంటరిగా హీరో లుక్ లో అందంగా ఉన్నాడు. అంతేకాదు ఆ పోస్టర్ పై ‘మెగా బ్లాక్‌బిస్టర్’ అని రాసి ఉంది. సెప్టెంబర్ ‘4న ట్రైలర్ విడుదల’ అని రాసి ఉంది. రోహిత్ క్యాప్షన్‌లో “నేను కొద్దిగా భయపడ్డాను. ఇదొక అరంగేట్రం.” అనే క్యాప్షన్ ఇచ్చాడు ఆ పోస్టర్ కు.
రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్:
View this post on Instagram
గంగూలీ పోస్ట్ చేసిన ఫోటో: రోహిత్ శర్మ మాత్రమే కాదు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా కెప్టెన్ చేసినట్లే ఓ ఫోటో షేర్ చేశాడు. ఓ సినిమా పోస్టర్‌కి సంబంధించిన ఫోటోను కూడా గంగూలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్‌కి, రోహిత్ పోస్టర్‌లో ఉన్న ఈ ఇద్దరి ఫోటోలకి తేడా ఒక్కటే. గంగూలీ ఫొటోని షేర్ చేస్తూ.. షూటింగ్‌ని చాలా ఆనందించాను. కొత్త మెగా బ్లాక్‌బస్టర్ త్వరలో విడుదల కానుందని క్యాప్షన్ ఇచ్చాడు సౌరవ్.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
ప్రముఖ క్రికెటర్లు రోహిత్ , గంగూలీ మాత్రమే కాదు, దక్షిణాది ప్రముఖ నటి రష్మిక మందన్న కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి పోస్టర్‌ను ఒకటి పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి:
View this post on Instagram
రహస్యం ఏమిటంటే: రోహిత్, గంగూలీ ఇద్దరూ షేర్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు వీరిద్దరూ ఏ విషయానికి సంబంధించి పోస్టర్ ను పోస్ట్ చేశారని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. పోస్ట్ చూస్తుంటే ఇద్దరూ ఏదో సినిమాలో నటించడానికి మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు రానున్న రోజుల్లో రష్మికతో రోహిత్ తెరపై కనిపించవచ్చు అంటూ ఊహాగానాలు జోరుగా చేస్తున్నారు.
పాకిస్థాన్‌తో మళ్లీ పోటీ! సెప్టెంబర్ 4న ఏం జరుగుతుందో అని భారత క్రీడాభిమానులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు హాంకాంగ్-పాకిస్థాన్ లు తలపడనున్నాయి. మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందనే దానిపైనే టీమ్ ఇండియా అభిమానుల దృష్టి ఉంది. ఎందుకంటే ఈ జట్టు గెలిచిన జట్టుతో భారత్‌తో మ్యాచ్ తలపడనుంది. ఈ నేపథ్యంలో చాలామంది పాక్ గెలవాలని.. అప్పుడు మళ్లీ భారత్.. పాకిస్థాన్ తో తలపడి.. విజయాన్ని అందుకోవాలని ఎక్కువమంది భారత అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..