AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tilak Varma: పాకిస్థాన్‌పై మరోసారి చెలరేగిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ

Tilak Varma: ఏషియన్ గేమ్స్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించి అరుదైన చరిత్ర సృష్టించాడు. టీ20 ఫైనల్స్‌లో రెండుసార్లు యాభైకి పైగా పరుగులు చేసి విరాట్ కోహ్లీ ఎలైట్ క్లబ్‌లో చోటు సంపాదించాడు. తిలక్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా భారత్ భారీ స్కోరు సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.

Tilak Varma: పాకిస్థాన్‌పై మరోసారి చెలరేగిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
Tilak Varma
Rakesh
|

Updated on: Oct 03, 2026 | 3:50 PM

Share

Tilak Varma: జపాన్ వేదికగా జరిగిన 2026 ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ పసిడి పతక పోరులో టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన కడబరిచాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో తిలక్ వర్మ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ యంగ్ ప్లేయర్ కేవలం 22 బంతుల్లోనే 51 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. తిలక్ ఇన్నింగ్స్ కారణంగానే భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 211 పరుగుల భారీ స్కోరును సాధించగలిగింది.

సరికొత్త చరిత్ర సృష్టించిన తిలక్

అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్‌పై ఫైనల్ మ్యాచ్‌లలో రెండుసార్లు 50కి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా 23 ఏళ్ల తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. గత ఏడాది జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లోనూ పాక్‌పై అజేయంగా 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఏషియన్ గేమ్స్ ఫైనల్‌లో మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలోనూ తిలక్ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు.

విరాట్ కోహ్లీ ఎలైట్ క్లబ్‌లో చోటు

ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రత్యేకమైన క్లబ్‌లో తిలక్ వర్మ చోటు సంపాదించుకున్నాడు. టీ20 ఫైనల్ మ్యాచ్‌లలో రెండుసార్లు 50కి పైగా పరుగులు సాధించిన మూడో భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ 2014, 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఈ ఘనత సాధించాడు. అలాగే ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఫైనల్స్‌లో చెలరేగి రికార్డులు సృష్టించాడు.

కీలక భాగస్వామ్యంతో భారీ స్కోరు

పాకిస్థాన్‌తో జరిగిన ఈ తుది పోరులో భారత్ ఆరంభంలో తడబడినప్పటికీ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా తిలక్ వర్మ, శివం దూబేతో కలిసి ఆరో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దూబే కూడా 15 బంతుల్లో 27 పరుగులు చేసి జట్టు స్కోరును వందలు దాటించడంలో సహకరించాడు. ఈ విజయంతో భారత్ మళ్లీ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని దేశం గర్వపడేలా చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు
కేవలం 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచికరమైన ఉల్లి పచ్చడి..
కేవలం 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచికరమైన ఉల్లి పచ్చడి..
కేవలం గడ్డలే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలే
కేవలం గడ్డలే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలే
చివరి క్షణాల్లో అదరగొట్టిన అమన్.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్
చివరి క్షణాల్లో అదరగొట్టిన అమన్.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. ఇది చేయకపోతే..
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. ఇది చేయకపోతే..