IND vs SA: బీసీసీఐ నిర్ణయాన్ని అభినందించిన సల్మాన్ బట్.. ఎందుకంటే..

డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‎లో భారత్ 3 టెస్టులు ఆడనుంది...

IND vs SA: బీసీసీఐ నిర్ణయాన్ని అభినందించిన సల్మాన్ బట్.. ఎందుకంటే..
Team India
Follow us

|

Updated on: Dec 21, 2021 | 4:33 PM

డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‎లో భారత్ 3 టెస్టులు ఆడనుంది. ఇండియా టెస్ట్ సిరీస్‎తో పాటు వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. మొదట్లో ఈ పర్యటన డిసెంబర్ 17న ప్రారంభం కావాల్సి ఉంది. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్‎ రావడంతో BCCI, CSA మూడు సిరీస్‎లను వాయిదా వేశాయి. తర్వాత టీ20 సిరీస్‌ని వదులుకోవాలని భారత్ నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ ప్రశంసించారు. తన యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ, ఇండియాకు వారి ప్రాధాన్యతలు ఉన్నాయని అన్నారు. మెగా ICC ఈవెంట్‌కు ముందు మెన్ ఇన్ బ్లూ ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడవచ్చని కూడా అతను భావిస్తున్నాడు. ‎ “2022 టీ20 ప్రపంచ కప్ సంవత్సరం ఉన్నప్పటికీ భారత ఆటగాళ్లు IPLలో పుష్కలంగా క్రికెట్ ఆడతారు. వారు ప్రపంచ కప్‌కు దగ్గరగా ఆస్ట్రేలియాకు చేరుకుని అక్కడ (సిరీస్) ఆడే అవకాశం కూడా ఉంది.” అని బట్ చెప్పాడు. ఒక విషయం ఏమిటంటే ఇండియా ప్రాధాన్యత వన్డే, టెస్ట్ క్రికెట్ అని బట్ చెప్పాడు. అంతకుముందు వీడియోలలో బట్ టెస్ట్ ఫార్మాట్‌లో భారత్ ఎందుకు విజయవంతమైన జట్టుగా ఉందో వివరించాడు.

” భారత్ ‘ఎ’ జట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు వెళ్తాయి. ఇప్పుడు కూడా వారు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు” అని బట్ ఒక అభిమాని ప్రశ్నకు బదులిచ్చారు. “ నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మహ్మద్ సిరాజ్ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఎక్కువ భారత్ బయట ఆడాడు. అక్కడ అతను నాలుగు-రోజుల ఆటలలో పాల్గొన్నాడు. ఇతర దేశాలు అలా చేయడం లేదు. వారు భారతదేశం వంటి నాలుగు రోజుల క్రికెట్‌కు తమ ‘ఎ’ జట్లను పంపడం లేదు.” సల్మాన్ బట్ వివరించాడు.

Read Also..

IPL 2022 Mega Auction: భారత ఆల్‌రౌండర్‌కు భారీ షాక్ తగలనుందా.. విండీస్ సిరీస్‌ నుంచి ఔట్.. ఐపీఎల్‌ 2022లోనూ తక్కువ ధరకే?