AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Shastri: నన్ను, భరత్‌ను కోచ్‌గా ఉండొద్దని వారు కోరుకున్నరు: కీలక విషయాలు వెల్లడించిన రవిశాస్త్రి

Indian Cricket Team: రవిశాస్త్రి టీమ్ ఇండియాతో మొదట టీమ్ డైరెక్టర్‌గా, ఆపై ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఈ ఏడాది ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ తర్వాత అతను తన పదవిని వదులుకున్నాడు.

Ravi Shastri: నన్ను, భరత్‌ను కోచ్‌గా ఉండొద్దని వారు కోరుకున్నరు: కీలక విషయాలు వెల్లడించిన రవిశాస్త్రి
Bcci Ravi Shastri
Venkata Chari
|

Updated on: Dec 10, 2021 | 12:50 PM

Share

Ravi Shastri: రవిశాస్త్రి చాలా కాలం పాటు భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నారు. అతని ఆధ్వర్యంలో, జట్టు ఆస్ట్రేలియాలో వరుసగా రెండు టెస్టు సిరీస్‌లను గెలుచుకోవడంతో పాటు చాలా విజయాలను సాధించింది. టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా తన కాంట్రాక్ట్‌ను పొడిగించబోనని ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021కి ముందే శాస్త్రి తెలిపాడు. అతని తర్వాత రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పుడు శాస్త్రి టీమ్ ఇండియాతో గడిపిన సమయం గురించి మాట్లాడాడు. ఎన్నో కీలక విషయాలు వెల్లడించాడు. రవిశాస్త్రి ఇంగ్లీష్ వార్తాపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, కోచ్‌గా మారడం కొంతమందికి ఇష్టం లేదని పేర్కొన్నాడు. ప్రధాన కోచ్‌గా తన పదవీకాలాన్ని ప్రారంభించే ముందు, రవిశాస్త్రి కూడా టీమ్ ఇండియా డైరెక్టర్‌గా ఉన్నాడు. 2014లో ఈ పదవిని చేపట్టాడు. అయితే రవిశాస్తిని ఈ పదవి నుంచి తప్పించి అనిల్ కుంబ్లేను టీమిండియా కోచ్‌గా నియమించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో వివాదం కారణంగా కుంబ్లే తన పదవిని విడిచిపెట్టడంతో, ఆపై శాస్త్రి తిరిగి భారత కోచ్‌గా నియమితుడయ్యాడు.

శాస్త్రి తాను టీమ్ డైరెక్టర్‌గా ఉన్న సమయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. 2014 నుంచి టీమ్ ఇండియాతో తన సమయాన్ని గుర్తు చేసుకుంటూ, శాస్త్రి ఇలా అన్నాడు.. “నా ఏడేళ్ల ప్రయాణాన్ని పరిశీలిస్తే, ఈ జట్టు 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 30-40 పరుగులతో వెనుకబడిన జట్టుగా నిలిచింది. 2021లో ఈ జట్టు 328 పరుగులను సులభంగా ఛేదించింది. అడిలైడ్ టెస్ట్-2014 నుంచి మేం ఈ రకమైన క్రికెట్ ఆడాలనుకుంటున్నామని జట్టుకు ఈ సందేశాన్ని పంపాం. అదే సమయంలో, ధోని నుంచి విరాట్‌కు కెప్టెన్సీ వచ్చింది. అప్పుడు నాకు ఒక్కసారిగా షాక్ తగిలింది. నన్ను అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి బయటకు వెళ్లాలని తెలిపారు. నేను విత్తనాలు నాటాను. పండ్లు పెరుగుతున్నాయి. ఆ టైంలో బయటకు వెళ్లమన్నారు. కారణం ఎవరూ చెప్పలేదు” అని పేర్కొన్నాడు.

చాలా బాధగా ఉంది – శాస్త్రి దీంతో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని శాస్త్రి తెలిపాడు. “అవును, నన్ను తొలగించిన విధానం సరిగ్గా లేనందున నేను బాధపడ్డాను. నన్ను బయటకు తీసుకురావడానికి మంచి మార్గాలు ఉండేవి. ఈ విషయం జరిగి అప్పటికే తొమ్మిది నెలలు గడిచిపోయాయి. ఆ తరువాత వ్యాఖ్యానంలో బిజీగా మారిపోయాడు. జట్టులో తప్పేమీ లేదని నాకు తెలియదు. జట్టులో సమస్య ఉందని నాతో అన్నారు. తొమ్మిది నెలల్లో సమస్య ఎలా ఉంటుంది? నేను విడిచిపెట్టిన జట్టు మంచి స్థితిలో ఉంది. నా రెండో టర్మ్‌లో ఎన్నో వివాదాల తర్వాత వచ్చాను. నన్ను బయట పంపాలని కోరుకున్న వారికి ఇది చెంపదెబ్బ. వేరొకరిని ఎంచుకున్నారు. తొమ్మిది నెలల తర్వాత మరోసారి నేను టీమిండియా కోచ్‌గా ఎంపికయ్యాను” అని పేర్కొన్నాడు.

కోచ్‌గా నేను, భరత్‌ ఉండడం కొంతమందికి ఇష్టం లేదు.. బీసీసీఐలో కొందరు తనను హెడ్ కోచ్‌గా, భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్‌గా ఉండాలని కోరుకోవడం లేదని శాస్త్రి తెలిపాడు. “అవును, భరత్ అరుణ్‌ని బౌలింగ్ కోచ్‌గా నియమించాలని వారు కూడా కోరుకోలేదు. పరిస్థితులు ఎలా మారిపోయాయో మీరు చూశారు. బౌలింగ్‌ కోచ్‌ కావాలని కోరుకోని దేశానికే అత్యుత్తమ బౌలింగ్‌ కోచ్‌ అని నిరూపించుకున్నాడు. నేను ఏ ఒక్కరి వైపు వేలు చూపడం లేదు” అని పేర్కొన్నాడు.

Also Read: Watch Video: ఆస్ట్రేలియా అమ్మాయి.. ఇంగ్లండ్ అబ్బాయి.. గబ్బా టెస్టులో ప్రపోజల్.. నెజిటన్లను ఫిదా చేస్తోన్న వీడియో..!

U-19 Asia Cup: ఆసియా కప్‌‌లో పాల్గొనే భారత జట్టు ఇదే.. ప్రకటించిన బీసీసీఐ.. ఎనిమిదోసారి టైటిల్‌ గెలిచేందుకు సిద్ధం..!