AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Shastri: ఆ ముగ్గురి ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పిన రవి శాస్త్రి.. ఇంతకీ ఎవరు వారు..

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి 4 సంవత్సరాల సుదీర్ఘ పదవీకాలం నవంబర్ 2021లో ముగిసింది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా టెస్టుల నుంచి వన్డేల వరకు దేశ విదేశాల్లో ఎన్నో విజయాలను అందుకుంది...

Ravi Shastri: ఆ ముగ్గురి ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పిన రవి శాస్త్రి.. ఇంతకీ ఎవరు వారు..
Photo Courtesy: Ravi Sastry Twitter
Srinivas Chekkilla
|

Updated on: Dec 10, 2021 | 1:30 PM

Share

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి 4 సంవత్సరాల సుదీర్ఘ పదవీకాలం నవంబర్ 2021లో ముగిసింది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా టెస్టుల నుంచి వన్డేల వరకు దేశ విదేశాల్లో ఎన్నో విజయాలను అందుకుంది. అయితే, శాస్త్రి హయాంలో వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జట్టు ఎంపిక విషయంలో కొన్ని వివాదాస్పద నిర్ణయాలపై, మాజీ భారత కోచ్ ఇంగ్లీష్ వార్తాపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వివరణను ఇచ్చాడు.

అజింక్యా రహానే- 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల కోసం టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తుది జట్టు నుంచి తొలగించారు. ఇది అప్పట్లో వివాదంగా మారింది. దానికి కారణాలను శాస్త్రి వివరించారు. “అజింక్యా, రోహిత్ (శర్మ) మధ్య నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇద్దరికీ (ప్లేయింగ్ XIలో) చోటు లభించలేదు. రోహిత్ పరుగులు సాధించాడు. అతనిలో టెస్ట్ ఆడే ఆసక్తిని చూడగలిగాము. అందుకే ఫామ్ ఆధారంగా నిర్ణయం తీసుకున్నాం. రోహిత్ రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు, ఆ తర్వాత చివరి టెస్టులో రహానే తిరిగి వచ్చి హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు.” అని శాస్త్రి చెప్పాడు.

2018 ఇంగ్లండ్ సిరీస్‌లో, పుజారాను మొదటి టెస్ట్‌ తుది జట్టు నుంచి తొలగించారు. ఆ మ్యాచ్‌లో టీం ఇండియా ఓడిపోయింది. “మేము వారికి చెప్పాం. అతను ఫామ్‌లో లేడు, ఎందుకు అలా చేశాడో అతనికి అర్థం అయింది. అతనిని డ్రాప్ చేయడం అతనికి ప్రయోజనం కలిగింది. అతను తిరిగి వచ్చినప్పుడు చాలా బాగా ఆడాడు. పుజారా తదుపరి 4 టెస్టులు ఆడాడు, అందులో ఒక సెంచరీ, అర్ధ సెంచరీ చేశాడు.” అని శాస్త్రి వివరించాడు.

2019 ప్రపంచకప్‌కు అంబటి రాయుడిని ఎంపిక చేయలేదు. రాయుడు దాదాపు రెండేళ్ల పాటు జట్టులో 4వ స్థానంలో ఆడుతున్నాడు. కానీ అతను ప్రపంచ కప్ జట్టులో ఎంపిక కాలేదు. ఇది విమర్శలకు దారితీసింది. ఇది సెలక్టర్ల నిర్ణయమని శాస్త్రి చెప్పాడు. “ఇందులో నా పాత్ర లేదు. కానీ 3 ప్రపంచకప్‌లలో 3 వికెట్‌కీపర్లను కలిగి ఉండాలనే నిర్ణయంతో నేను సంతోషంగా లేను. శ్రేయాస్ అయ్యర్ లేదా అంబటి రావచ్చు. ఎంఎస్ ధోని, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్‌లను కలిసి ఉంచడానికి గల కారణం ఏమిటి? కానీ సెలక్టర్ల పనిలో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. నన్ను అభిప్రాయం అడగడం లేదా చర్చించడం తప్ప. అని శాస్త్రి గతంలో జరిగిన విషయాలను చెప్పాడు

Read Also.. Ravi Shastri: నన్ను, భరత్‌ను కోచ్‌గా ఉండొద్దని వారు కోరుకున్నరు: కీలక విషయాలు వెల్లడించిన రవిశాస్త్రి