The Hundred League: 49 బంతుల్లో 88 నాటౌట్‌..11 ఫోర్లు 3 సిక్స్‌లతో సుడిగాలి ఇన్నింగ్స్‌.. హండ్రెడ్‌ లీగ్‌లో సంచలనం

David Malan: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న హండ్రెడ్‌ లీగ్‌ 2022లో ఇంగ్లండ్‌ టీ20 స్పెషలిస్ట్‌ డేవిడ్‌ మలాన్ (David Malan) బౌలర్లకు చుక్కలు చూపించాడు. ట్రెంట్‌ రాకెట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డేవిడ్‌ నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 88 రన్స్‌ చేసి..

The Hundred League: 49 బంతుల్లో 88 నాటౌట్‌..11 ఫోర్లు 3 సిక్స్‌లతో సుడిగాలి ఇన్నింగ్స్‌.. హండ్రెడ్‌ లీగ్‌లో సంచలనం
Dawid Malan
Follow us

|

Updated on: Aug 10, 2022 | 3:26 PM

David Malan: టెస్ట్‌ క్రికెట్‌.. వన్డే క్రికెట్‌.. టీ20 క్రికెట్‌.. ఇప్పుడు హండ్రెడ్‌ బాల్స్‌ లీగ్‌.. ఇలా క్రికెట్‌ రూపాంతంర చెందుతూనే ఉంది. 10 ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌లు కూడా ప్రతిపాదనలో ఉన్నాయి. ఇలా మ్యాచ్‌లో ఓవర్లు తగ్గేకొద్దీ బ్యాటర్లు మరింత రెచ్చిపోతున్నారు. దూకుడైన బ్యాటింగ్‌తో బౌలర్లకు పీడకలలా మారిపోతున్నారు. ఇంగ్లండ్‌ టీ20 స్పెషలిస్ట్‌ డేవిడ్‌ మలాన్ (David Malan) ఇప్పుడే అదే చేస్తున్నాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న హండ్రెడ్‌ లీగ్‌ 2022లో ఈ స్టార్ బ్యాటర్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ట్రెంట్‌ రాకెట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డేవిడ్‌ నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 88 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ లెఫ్టార్మ్‌ బ్యాటర్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. మ్యాచ్‌ ఆద్యంతం 175కు పైగా స్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన మలాన్ తన జట్టుకు 7 వికెట్ల విజయాన్ని అందించాడు. ఈక్రమంలోనే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం అందుకున్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. డేనియల్‌ సామ్స్‌ (3/31), ఫ్లెచర్‌ (2/22), లూక్‌ వుడ్‌ (2/30) రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో ట్రెంట్‌ రాకెట్స్‌ ఆది నుంచే దూకుడుగా ఆడింది. మలాన్‌ తో పాటు మరో ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మొదటి వికెట్‌కు 53 బంతుల్లోనే 86 పరుగులు జోడించారు. అలెక్స్‌ ఔటైనా తన దూకుడును కొనసాగించాడు డేవిడ్‌. దీంతో మరో 6 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కాగా తొలి మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించిన ట్రెంట్‌ రాకెట్స్‌.. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..