
ICC ODI Batters Rankings: బుధవారం విడుదలైన ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ తగిలింది. తాజా ర్యాకింగ్స్‌లో భారత ఆటగాడు శుభ్‌మాన్ గిల్ అధికారికంగా అగ్రస్థానానికి చేరుకుని, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజంకు బిగ్ షాక్ ఇచ్చాడు. గిల్ ఇప్పుడు 796 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని పొందాడు. గతంలో ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం చెలాయించిన బాబర్ 773 పాయింట్లతో రెండవ స్థానానికి పడిపోయాడు.
ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు సాధించిన అద్భుతమైన ప్రదర్శనతో గిల్ నంబర్ 1 స్థానానికి ఎదిగాడు. భారతదేశం 3-0 సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ర్యాంకింగ్స్‌లో బాబర్‌ను అధిగమించడంతోపాటు అగ్రస్థానాన్ని అందుకున్నాడు.
ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో యాభైకి పైగా పరుగులు చేయడం ద్వారా, మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో ఈ ఘనత సాధించిన ఏడవ భారతీయ బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు. ముఖ్యంగా, ఇంగ్లాండ్‌పై ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు కూడా అతను కావడం గమనార్హం.
Shubman Gill Become The New No. 1 ODI Batter In The World..!!
– Shubman Gill 🔥 pic.twitter.com/nt9bjRYJQH
— Maan (@Maan8856) February 19, 2025
గిల్ వన్డే కెరీర్ అద్భుతంగా కొనసాగుతోంది. తన మొదటి 50 మ్యాచ్‌ల్లో ఏడు సెంచరీలతో, అతను ఇప్పుడు తన కెరీర్‌లో ఈ దశలో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
గురువారం దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో తన కొత్త నంబర్ 1 ప్లేయర్, కీలక వేదికపై సత్తా చాటాలని భారత్ ఆశిస్తోంది.
Before the Champions Trophy: Shubman Gill new Hollywood Star
After the Champions Trophy: Babar Azam Rank 6 and counting pic.twitter.com/FeJ1KjchAA
— Shah (@IamShah102) February 19, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..