ENGW vs INDW : షెఫాలీ, మంధాన దుమ్మురేపినా.. కుప్ప కూలిన మిడిలార్డర్.. 209 పరుగుల వెనుకంజలో భారత మహిళలు

బ్రిస్టల్ లో జరుగుతోన్న ఏకైక టెస్ట్ లో ఇంగ్లండ్ మహిళల టీం పై చేయి సాధించింది. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఉమెన్స్.. మొదట్లో పర్వాలేదనిపించినా.. చివరికి చేతులెత్తేశారు.

ENGW vs INDW : షెఫాలీ, మంధాన దుమ్మురేపినా.. కుప్ప కూలిన మిడిలార్డర్.. 209 పరుగుల వెనుకంజలో భారత మహిళలు
Shafali Verma
Follow us
Venkata Chari

|

Updated on: Jun 18, 2021 | 11:10 AM

ENGW vs INDW : బ్రిస్టల్ లో జరుగుతోన్న ఏకైక టెస్ట్ లో ఇంగ్లండ్ మహిళల టీం పై చేయి సాధించింది. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఉమెన్స్.. మొదట్లో పర్వాలేదనిపించినా.. చివరికి చేతులెత్తేశారు. ఈ మేరకు మూడో రోజు ఆట చాలా కీలకం కానుంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 396/9 పరుగుల వద్ద ఇంగ్లండ్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఓపెనర్లు షెఫాలీ వర్మ (96; 152 బంతుల్లో 13×4, 2×6), స్మృతి మంధాన (78; 155 బంతుల్లో 14×4) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఓ దశలో 167/0తో దూసుకపోతున్నట్లు కనిపించారు. ఆతరువాత వెంట వెంటనే వికెట్లు కొల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుసగా ఐదు వికెట్లు సమర్పించుకుని 187/5 తో ఇబ్బందులో కూరుకపోయారు. భారత్ స్కోర్ 167వద్ద తొలి వికెట్‌గా షెఫాలి వర్మ పెవిలియన్ చేరగా… ఆ వెంటనే స్మృతి కూడా వికెట్ సమర్పించుకుంది. అనంతరం వచ్చిన బ్యాట్స్‌ ఉమెన్స్‌ ఎక్కువ సేపు క్రీజులు నిలవలేకపోయారు.

పూనమ్‌ రౌత్‌ (2), శిఖా పాండే (0), కెప్టెన్‌ మిథాలీరాజ్‌ (2) విఫలమై.. నిరాశ పరిచారు. అయితే, ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.. కానీ, వాటిని అందుకోవడంలో కెప్టెన్ విఫలమైంది. కేవలం 45 నిమిషాలలోనే ఐదు వికెట్లు కోల్పోయి.. చేతులారా కష్టాలను కొనితెచ్చుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో హీథర్ నైట్ 2 వికెట్లు పడగొట్టింది. రెండో రోజు ముగిసే సమయానికి హర్మన్‌ప్రీత్‌ (4), దీప్తిశర్మ (0) క్రీజులో నిలిచారు. భారత మహిళలు ఇంకా 209 పరుగులు వెనుకబడే ఉన్నారు. దీంతో నేడు మిగతా బ్యాట్స్‌ ఉమెన్స్‌పై టీమిండయా విజయం ఆధారపడి ఉంది. మిడిలార్డర్ చేతులెత్తేయగా.. మరి టెయిలెండర్లు ఎలా నలబడతారో చూడాలి. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన షెఫాలీ వర్మ కు ఇది తొలి మ్యాచ్‌. ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టిన ఈ యవతి.. సెంచరీ చేసే అవకాశాన్ని కొద్దిలో మిస్ చేసుకుంది. అద్భుతమైన ఆటతీరులతో ఆకట్టుకుంది.

మరోవైపు ఓవర్‌నైట్‌ స్కోరు 269/6తో తొలి ఇన్నింగ్స్‌ ఆరభించిన ఇంగ్లండ్ ఉమెన్స్ సోఫియా డంక్లీ (74 నాటౌట్‌), ష్రబ్‌సోల్‌ (47)టీంకు విలువైన పరుగులు అందించి, మెరుగైన స్థితిలో ఉంచారు. చివరకు 396/9 వద్ద డిక్లేర్‌ చేసింది ఇంగ్లండ్ టీం. ఇక భారత బౌలర్లలో స్నేహ రాణా (4/131), దీప్తిశర్మ (3/65) రాణించగా, మిగతా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు.

Also Read:

WTC FINAL WEATHER UPDATE : డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌కి వర్షం ఎఫెక్ట్..! తొలిరోజు ఆట ఎంతసేపు జరుగుతుందో తెలుసుకోండి..

IND vs NZ WTC Prediction: సమఉజ్జీల పోరులో గెలిచేదెవరో..? తొలి కప్‌ను సాధించేందుకు కోహ్లీ, విలియమ్సన్‌ తహతహ!