AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC FINAL WEATHER UPDATE : డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌కి వర్షం ఎఫెక్ట్..! తొలిరోజు ఆట ఎంతసేపు జరుగుతుందో తెలుసుకోండి..

WEATHER UPDATE : టెస్ట్ క్రికెట్ అతిపెద్ద మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అయితే వర్షం మ్యాచ్

WTC FINAL WEATHER UPDATE  : డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌కి వర్షం ఎఫెక్ట్..! తొలిరోజు ఆట ఎంతసేపు జరుగుతుందో తెలుసుకోండి..
Wether Update
uppula Raju
|

Updated on: Jun 18, 2021 | 10:30 AM

Share

WEATHER UPDATE : టెస్ట్ క్రికెట్ అతిపెద్ద మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అయితే వర్షం మ్యాచ్ విలన్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. జూన్ 17 న సౌతాంప్టన్‌లో భారీగా వర్షం కురిసింది. వాస్తవానికి భారతదేశం, న్యూజిలాండ్ మధ్య జూన్ 18 నుంచి 22 వరకు మ్యాచ్ జరుగుతుంది. కానీ సమస్య ఏమిటంటే ఈ ఐదు రోజులలో వాతావరణ శాఖ నాలుగు రోజులు వర్షం పడే అవకాశాన్ని వ్యక్తం చేసింది. తుఫాను గాలులు ఒకటి లేదా రెండు రోజులు అంచనా వేయబడ్డాయి. వాతావరణ విభాగం ప్రకారం.. మ్యాచ్ నాల్గవ రోజు జూన్ 21 న తప్ప, మిగతా అన్ని రోజులలో వర్షం పడుతుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ కూడా వర్షం అడ్డంకిగా మారిన విషయం తెలిసిందే. ఈ కారణంగా మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మొదటి రోజు 90 ఓవర్లు ఆడటం కష్టం ఇప్పుడు సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో వర్షం పడే అవకాశం సరైనదని భావిస్తే అభిమానులు షాక్‌కు గురికావడం ఖాయం. కానీ ఇంగ్లాండ్‌లోని వర్షానికి దాని సొంత శైలి ఉంటుంది. గతంలో సౌతాంప్టన్‌లో వర్షం కురిస్తే ప్రారంభమై ఆగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అటువంటి పరిస్థితిలో మొదటి రోజు వాతావరణ పరిస్థితుల ప్రకారం.. మ్యాచ్ రెండు మూడు గంటలు ప్రభావితమవుతుందని అంచనా వేస్తున్నారు. దీని అర్థం మొదటి రోజు 90 కి బదులుగా అభిమానులు 60 నుంచి 70 ఓవర్ల ఆటను మాత్రమే చూడగలరు. ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ తొలి మ్యాచ్‌లో ఎంత సమయం ఆడుతుందనే ప్రశ్నకు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ సమాధానం లభిస్తుంది. అయితే అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ ట్రోఫీని ఏ జట్టు కైవసం చేసుకుంటుందో అని ఆసక్తి నెలకొంది.

WTC Final 2021 IND vs NZ: డబ్ల్యూటీసీ ఫైనల్‌ కు అంతా సిద్ధం..! లైవ్ అందించే ఛానల్స్ ఇవే..!

Kanugula Venkata Rao : రచయిత కణుగుల వెంకటరావు గుండెపోటుతో కన్నుమూత.. సాహితీ లోకానికి తీరని లోటు..

IND vs NZ WTC Prediction: సమఉజ్జీల పోరులో గెలిచేదెవరో..? తొలి కప్‌ను సాధించేందుకు కోహ్లీ, విలియమ్సన్‌ తహతహ!