AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T-20 World Cup: సెమీస్ లో టీమిండియా తలపడేది ఈ జట్టుతోనే.. మరి న్యూజిలాండ్..?..

టీ-20 వరల్డ్ కప్ పలు సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. పెద్ద పెద్ద జట్లకు చిన్న చిన్న జట్లు షాక్ ఇస్తున్నాయి. ఇంగ్లండ్ కు ఐర్లాండ్, పాకిస్తాన్ కు జింబాబ్వే ఇచ్చిన ఝలక్ లను మర్చిపోకముందే ఇవాళ (ఆదివారం) జరిగిన..

T-20 World Cup: సెమీస్ లో టీమిండియా తలపడేది ఈ జట్టుతోనే.. మరి న్యూజిలాండ్..?..
Team India
Ganesh Mudavath
|

Updated on: Nov 06, 2022 | 12:06 PM

Share

టీ-20 వరల్డ్ కప్ పలు సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. పెద్ద పెద్ద జట్లకు చిన్న చిన్న జట్లు షాక్ ఇస్తున్నాయి. ఇంగ్లండ్ కు ఐర్లాండ్, పాకిస్తాన్ కు జింబాబ్వే ఇచ్చిన ఝలక్ లను మర్చిపోకముందే ఇవాళ (ఆదివారం) జరిగిన సౌతాఫ్రికా – నెదర్లాండ్స్ మ్యాచ్ లో మరో సంచలనం నమోదైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటిన నెదర్లాండ్స్ బలమైన సౌతాఫ్రికా జట్టుపై 13 పరుగులు తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా నేరుగా సెమీస్ కు వెళ్లిపోయింది. దక్షిణాఫ్రికా సెమీస్ కు చేరుకోవాలనుకున్న ఆశలు గల్లంతయ్యాయి. అయితే.. ఆదివారం టీమిండియా జింబాబ్వేతో తలపడాల్సి ఉంది. ఇందులో గెలిస్తే వచ్చే రెండు పాయింట్లతో కలిసి టీమిండియాకు మొత్తంగా 8 పాయింట్లు లభిస్తాయి. ఓడినా పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. దీంతో ఈ టోర్నీలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ తర్వాత సెమీఫైనల్‌కు వెళ్లిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. దీంతో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడే అవకాశం ఉంది.

భారత్ సెమీస్ కు చేరడంతో ఏ జట్టుతో తలపడనుందనే విషయంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. T20 ప్రపంచ కప్ 2022లో ప్రతి మ్యాచ్‌కు మారుతున్న సమీకరణాల మధ్య టీమిండియా మొదటి సెమీ-ఫైనల్‌కు వెళ్లాలంటే జింబాబ్వేను ఓడించాల్సిన అవసరం ఉంది. అయితే అనూహ్యంగా జింబాబ్వేతో మ్యాచ్‌ ఆడకముందే భారత్‌ సెమీఫైనల్‌కు చేరింది. టీమిండియా తమ గ్రూప్ నుంచి సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందా. .లేక సెకండ్ ప్లేస్ లో ఉంటుందా అనేది చర్చనీయాంశం. జింబాబ్వేతో జరిగే మ్యాచ్ ద్వారా ఈ ఫలితం నిర్థారణ అవుతుంది. జింబాబ్వేపై భారత్ గెలిస్తే గ్రూప్‌ను ఫస్ట్ ప్లేస్ ను కైవసం చేసుకుంటుంది.

మరోవైపు ఓడిపోయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను ఓడిస్తే మెరుగైన రన్ రేట్ కారణంగా పాకిస్తాన్ అగ్రస్థానానికి చేరుకోవచ్చు. ఇలా జరగాలంటే టీమిండియా జింబాబ్వే చేతిలో ఓడిపోవాలి. సెమీస్‌ మ్యాచ్‌ నవంబర్‌ 10న అడిలైడ్‌లో గ్రూప్‌-1లో రెండో ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్‌తో తలపడనుంది. నవంబర్ 9 న జరిగే సెమీ ఫైనల్ ఫస్ట్ గ్రూప్ 1లో న్యూజిలాండ్‌తో ఏ జట్టు తలపడుతుందో వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి