గత వేలంలో ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 5 ఇన్నింగ్స్‌ల్లో 601 పరుగులతో బీభత్సం.. క్యూ కట్టిన ఐపీఎల్ టీంలు..!

Uday Saharan: గత ఐపీఎల్ వేలంలో అతడిని ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. కనీస ధరకు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశవాళీ టోర్నీలో పరుగుల వరద పారిస్తూ ముంబై, ఢిల్లీ లాంటి దిగ్గజ జట్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు భారత అండర్-19 మాజీ కెప్టెన్ ఉదయ్ సహారన్. రాబోయే వేలంలో కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి.

గత వేలంలో ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 5 ఇన్నింగ్స్‌ల్లో 601 పరుగులతో బీభత్సం.. క్యూ కట్టిన ఐపీఎల్ టీంలు..!
Uday Saharan

Updated on: Aug 19, 2026 | 1:32 PM

Uday Saharan: ఇటీవల పంజాబ్ ఇంటర్-స్టేట్ వన్డే టోర్నీలో ఉదయ్ సహారన్ ఆడిన తీరు క్రీడాభిమానులను విస్మయానికి గురిచేసింది. బటిండా జట్టు తరపున బరిలోకి దిగిన ఈ 21 ఏళ్ల కుర్రాడు.. కేవలం 5 ఇన్నింగ్స్‌లలోనే ఏకంగా 150.25 సగటుతో 601 పరుగులు సాధించాడు. ఇందులో రెండు ద్విశతకాలతో పాటు ఒక సెంచరీ కూడా ఉండటం విశేషం. సెమీఫైనల్‌లో ఫతేగఢ్‌పై 163 పరుగులు చేసిన అతడు.. ఫైనల్లో మరింత రెచ్చిపోయాడు. ఏకంగా 394 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అజేయ ద్విశతకం బాది బటిండా జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒత్తిడిని జయిస్తూ భారీ స్కోర్లు సాధించే సత్తా ఉన్న ఆటగాడిగా నిరూపించుకున్నాడు. అద్భుతమైన టెక్నిక్, క్రీజులో నిలదొక్కుకునే ఓపిక అతడి సొంతం. ఈ ప్రదర్శనతోనే అతడు ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల రాడార్‌లోకి వచ్చాడు.

ముంబై, ఢిల్లీ జట్ల కన్ను..

భారత అండర్-19 జట్టుకు 2024 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన సహారన్.. చిన్న వయసు నుంచి అద్భుతమైన నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు. ప్రస్తుతం భవిష్యత్ భారత ఓపెనర్‌గా అతడిని పలు ఫ్రాంచైజీలు చూస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు అతడిని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ జట్టుకు నమ్మకమైన భారత ఓపెనర్ అవసరం ఉంది. ఉదయ్ వస్తే విదేశీ ఆటగాళ్లపై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది. అలాగే యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ముంబై కూడా పకడ్బందీ వ్యూహంతో అతడిని టార్గెట్ చేస్తోంది.

ఎక్కువమంది చదివినది: 94 ఫోర్లు, 6 సిక్సర్లతో 1107 పరుగులు.. క్రికెట్ హిస్టరీలోనే ఎన్నటికీ బద్దలవ్వని క్రేజీ రికార్డ్..!

కేకేఆర్ వ్యూహం.. వేలంలో కోట్ల వర్షం!

యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎప్పుడూ ముందుంటుంది. శుభ్‌మన్ గిల్, అంగ్‌క్రిష్ రఘువంశీ లాంటి ఆటగాళ్లను కేకేఆర్ ఎలా సానబెట్టిందో చూశాం. ఇప్పుడు సహారన్ వైపు కూడా ఆ జట్టు ఆసక్తిగా చూస్తోంది. ఇటీవలే షేర్-ఏ-పంజాబ్ టీ20 లీగ్‌లో బటిండా రాయల్స్ ఫ్రాంచైజీ ఇతడిని రూ.4.20 లక్షలకు కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్‌లో ఈ రేంజ్ ప్రదర్శన చేస్తున్న ఈ పంజాబ్ బ్యాటర్ కోసం రాబోయే ఐపీఎల్ వేలంలో ఈ మూడు ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. అదే జరిగితే అతడి ధర కోట్ల రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

గత వేలంలో నిరాశే ఎదురైనా.. తన బ్యాట్‌తోనే ఉదయ్ సహారన్ విమర్శకులకు దీటైన సమాధానం చెప్పాడు. రాబోయే ఐపీఎల్ వేలంలో అతడు ఏ ఫ్రాంచైజీకి వెళ్తాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. పంజాబ్ ఇంటర్-స్టేట్ వన్డే టోర్నీలో 601 పరుగులతో చెలరేగిన అండర్-19 మాజీ కెప్టెన్ ఉదయ్ సహారన్ కోసం ఐపీఎల్ జట్లు పోటీ పడుతున్నాయి. ముంబై, ఢిల్లీ ఆసక్తి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us